Vijay Deverakonda: దళపతి విజయ్ పాలిటిక్స్ పై అలాంటి కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ.?
- Author : Sailaja Reddy
Date : 03-04-2024 - 12:52 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. గత సినిమా ఖుషితో మంచి సక్సెస్ ను అందుకున్న విజయ్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join
ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ మేకర్ ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా తెలుగుతో పాటు తమిళ ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ వస్తున్నారు హీరో విజయ్. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దళపతి విజయ్ పాలిటిక్స్ గురించి మాట్లాడారు. తమిళ స్టార్ హీరో విజయ్.. ఇటీవల పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి మీ కామెంట్స్ ఏంటని విజయ్ ని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. నేను విజయ్ సార్ మూవీ ఫంక్షన్స్ చూసేవాడిని.
వాటిలో విజయ్ సార్ చాలా బాగా మాట్లాడుతూ కనిపించేవారు. ఒక లీడర్ లో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం పబ్లిక్ లో అందరికి అర్ధమయ్యేలా మాట్లాడడం, ఆ చెప్పే విషయాన్ని వినేవారికి చాలా దృడంగా చెప్పడం. ప్రపంచంలోని ఎంతోమంది గొప్ప లీడర్స్ లో ఈ లక్షణం కనిపిస్తుంది. అలాంటి వ్యాఖ్యాచాతుర్యం విజయ్ సార్ లో ఉంది. దానితో భవిషత్తులో ఆయన ఎలాంటి మార్పులు తీసుకు వస్తారో అనేది చూడాలని ఉంది అని తెలిపారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
VD about Thalapathy’s Political Entry!
— Christopher Kanagaraj (@Chrissuccess) April 2, 2024
ఇకపోతే దళపతి విజయ్ విషయానికొస్తే ఆయన ఇటీవల పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన చివరి సినిమాలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో పాల్గొంటున్నారు. ఇక ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగు, తమిళంలోనే రిలీజ్ అవుతున్న ఈ చిత్రం రెండు వారాలు తరువాత హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ కానుంది. ఏప్రిల్ 5న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని పరుశురాం డైరెక్ట్ చేసారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. గీత గోవిందం తరువాత విజయ్ అండ్ పరుశురాం నుంచి వస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతోఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి.
Also Read: Tamannaah Bhatia: మరోసారి ఘాటు అందాలతో రెచ్చిపోయిన తమన్నా.. అందాల ఆరబోత మామూలుగా లేదుగా?