Suriya – Jyothika: భర్తతో కలిసి జిమ్లో వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడుతున్న జ్యోతిక.. వీడియో వైరల్!
- Author : Vamsi Chowdary Korata
Date : 03-04-2024 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
కోలీవుడ్ స్టార్ సెలబ్రిటీ జంటల్లో ఒకరైన సూర్య జ్యోతికల గురించి మనందరికీ తెలిసిందే. ఈ జంటకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అలాగే కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతికలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తమ బాండింగ్ తో సూర్య, జ్యోతిక అందర్నీ ఆకట్టుకుంటుంటారు. ఒకే ప్రొఫిషన్ కి చెందిన ఇద్దరి మధ్య ఇంతటి బాండింగ్ ఉండడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది.
We’re now on WhatsApp. Click to Join
అలాంటిది వీరిద్దరూ ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా కనిపిస్తూ అందర్నీ మెస్మరైజ్ చేస్తుంటారు. తాజాగా వీరిద్దరూ కలిసి జిమ్‌లో వర్క్ అవుట్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ప్రతి విషయంలో భర్తకి తోడుగా భార్య ఉంటే ఆ మ్యారేజ్ లైఫ్ చాలా బాగుటుంది. ఆ పాయింట్ నే జ్యోతిక చాలా గట్టిగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.
Also Read: Dimple Hayathi: అదేంటి డింపుల్ హయతి అలా మారిపోయింది.. గుర్తుపట్టడం కష్టమే?
ప్రస్తుతం సూర్య కంగువ వంటి భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్య ఒక వైల్డ్ బీస్ట్ గా కనిపించబోతున్నారు. దీంతో భారీ కండలు పెంచాల్సి వచ్చింది. అందుకోసమే జిమ్ లో భారీ కసరత్తులు చేస్తున్నారు. ఇక కసరత్తులో సూర్యకి తోడుగా జ్యోతిక కూడా పాల్గొంటూ జోష్ నింపుతున్నారు.
👌
— Christopher Kanagaraj (@Chrissuccess) April 2, 2024
సూర్యతో పాటుగా జ్యోతిక కూడా ప్రతి వర్క్ అవుట్ చేస్తూ.. సూర్యలో ఫైటింగ్ స్పిరిట్ ని తీసుకు వస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ సూర్యతో సమానంగా జ్యోతిక చేస్తున్న వర్క్ అవుట్స్ చూసి వావ్ అంటూ మెచ్చుకుంటున్నారు. చూడముచ్చటైన జంట చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమాణులు. సూర్య నటించిన సినిమాలు కొన్ని తెలుగులోకి విడుదలైన తెలిసిందే. ఇటీవల అనగా పాన్ ఇండియా సినిమాలు ట్రెండు మొదలైన తర్వాత సూర్య నటించిన సినిమాల్లో అన్ని భాషల్లోకి విడుదల అవుతున్నాయి.