Ram Charan : బెస్ట్ హస్బండ్ మాత్రమే కాదు బెస్ట్ థెరపిస్ట్ కూడా..!
Ram Charan గ్లోబల్ స్టార్ రాం చరణ్ పొగడ్తలతో ముంచెత్తుతుంది ఆయన సతీమణి ఉపాసన. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన ఆఫ్టర్ డెలివరీ సవాళ్ల గురించి
- By Ramesh Published Date - 04:53 PM, Tue - 14 May 24

Ram Charan గ్లోబల్ స్టార్ రాం చరణ్ పొగడ్తలతో ముంచెత్తుతుంది ఆయన సతీమణి ఉపాసన. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన ఆఫ్టర్ డెలివరీ సవాళ్ల గురించి ప్రస్తావించారు. డెలివరీ అయ్యాక మహిళలు చాలా ఇబ్బందులు పడుతుంటారని. ఆఫ్టర్ డెలివరీ అంత ఈజీగా ఉండదని.. డిప్రెషన్ కు వెళ్తామని ఉపాసన చెప్పుకొచ్చారు. అయితే అలాంటి టైం లో తనకు చరణ్ ఒక థెరపిస్ట్ లా పనిచేశాడని. తను డిప్రెషన్ లోకి వెళ్లకుండా చరణ్ తనని బాగా చూసుకున్నాడని ఉపాసన అన్నారు.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేయాలని చాలామందికి ఉంటుంది. దాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అంతా బాగుంటుంది. ఆ విషయంలో చరణ్ మంచి ప్లానింగ్ తో ఉంటున్నాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి తగిన సమయాన్ని కేటాయిస్తున్నారు.
ఇక ఉపాసన డెలివరీ టైం లో ఆమెకు చాలా సపోర్ట్ గా ఉన్నారు. ఇదే విషయాన్ని ఉపాసన చెప్పుకొచ్చారు. తాను ఎంత పెద్ద హీరో అయినా సరే భర్తగా తన బాధ్యత నిర్వర్తించడంలో చరణ్ ది బెస్ట్ అనిపించుకున్నాడని చెప్పొచ్చు. ది బెస్ట్ హస్బండ్ మాత్రమే కాదు ఉపాసన చెప్పినట్టుగా బెస్ట్ థెరపిస్ట్ గా కూడా చరణ్ మంచి మార్కులు కొట్టేస్తున్నాడు.
చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ విషయానికి వస్తే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉంటుందని చెబుతున్నారు.