Prabhas Mr Perfect movie Released in Japan : జపాన్ లో రిలీజైన ప్రభాస్ 13 ఏళ్ల క్రితం సినిమా.. సూపర్ రెస్పాన్స్..!
Prabhas Mr Perfect movie Released in Japan బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఏ సినిమా
- By Ramesh Published Date - 04:33 PM, Tue - 14 May 24

Prabhas Mr Perfect movie Released in Japan బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా అది ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ అవుతుంది. సలార్ 1 తో మాస్ హిట్ అందుకున్న ప్రభాస్ త్వరలో కల్కి 2898 ఏడితో రాబోతున్నాడు. ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు.
ప్రభాస్ సినిమాలు ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు. జపాన్ లో మన రెబల్ స్టార్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. బాహుబలి సినిమా అక్కడ ఒక రేంజ్ వసూళ్లను రాబట్టింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా జపాన్ లో సెన్సేషనల్ హిట్ అందుకుంది. అయితే ప్రభాస్ ఒకప్పటి మూవీ జపాన్ లో లేటెస్ట్ గా రీ రిలీజ్ చేశారు. ప్రభాస్ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు జపాన్ లో అతను నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా రిలీజ్ చేశారు.
మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా 2011 లో రిలీజైంది. దశరథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జపాన్ లో రిలీజై సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. కల్కి రిలీజ్ ఇంకా 50 రోజులే ఉండగా ఈ టైం లో జపాన్ లో ఒకప్పటి సినిమాతోనే ప్రభాస్ తన రేంజ్ ఏంటో చూపించాడు. కచ్చితంగా కల్కి జపాన్ లో కూడా భారీ హిట్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఒకప్పుడు జపాన్ లో సూపర్ స్టార్ రజినికాంత్ కు మాత్రమే విపరీతమైన ఫ్యాన్స్ ఉండేవారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ప్రభాస్, రాం చరణ్, ఎన్.టి.ఆర్ అందరు చేరారు. పుష్ప 2 కూడా జపాన్ లో రిలీజ్ చేసే ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తుంది.