Trisha Tollywood Offer : స్టార్ హీరోతో త్రిష రొమాన్స్.. తెలుగు ఆఫర్ కొట్టేసిన అమ్మడు..!
Trisha Tollywood Offer 40 ప్లస్ ఏజ్ లో కూడా త్రిష తన లుక్స్ తో ఆడియన్స్ ని అవాక్కయ్యేలా చేస్తుంది. తెలుగులో పూర్తిగా సినిమాలు ఆపేసిన త్రిష
- Author : Ramesh
Date : 23-10-2023 - 9:34 IST
Published By : Hashtagu Telugu Desk
Trisha Tollywood Offer 40 ప్లస్ ఏజ్ లో కూడా త్రిష తన లుక్స్ తో ఆడియన్స్ ని అవాక్కయ్యేలా చేస్తుంది. తెలుగులో పూర్తిగా సినిమాలు ఆపేసిన త్రిష (Trisha) తమిళంలో వరుసగా చేస్తూ వస్తుంది. 96 సినిమాతో అమ్మడు అక్కడ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. అప్పటి నుంచి త్రిష వరుసగా సినిమాలు చేస్తుంది. లేటెస్ట్ గా దళపతి విజయ్ తో లియో (LEO) సినిమా చేసింది త్రిష. ఈ సినిమాలో త్రిష పాత్ర కొద్దిసేపే అయినా ఆమె లుక్స్ మాత్రం అదరగొట్టాయి.
త్రిష అందానికి కారణం ఏంటో కానీ అమ్మడు స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇదే ఊపుతో త్రిషకు మరోసారి టాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ (Bobby) డైరెక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. టాలీవుడ్ నుంచి వస్తున్న ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్న త్రిష ఈసారి బాలకృష్ణ (Balakrishna) సినిమాకు ఓకే చెప్పిందని టాక్. ఇంతకుముందు త్రిష చిరు సినిమాలు రెండిటిని కాదన్నది. అయితే ఈ టైం లో ఏ ఆఫర్ వచ్చినా చేయాల్సిందే అని బాలయ్య సినిమాకు ఓకే చెప్పింది. బాలకృష్ణ సినిమాలో త్రిష హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యిందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.
Also Read : Ram Charan : వాళ్లకు సారీ చెప్పిన రాం చరణ్.. ఎందుకంటే..?