Nidhi Aggarwal: టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు..
- By Maheswara Rao Nadella Published Date - 03:52 PM, Tue - 28 March 23

Nidhi Aggarwal : సెలబ్రిటీల జాతకాలు చెప్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన వేణు స్వామి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్లో పూజలు, యాగం చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది
తమ కెరీర్ బాగా సాగేందుకు, సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు కోసం నిధి అగర్వాల్ పూజలు ఈ చేసింది. వేణుస్వామిని కలిసి తన ఇంట్లో ప్రత్యేకంగా పూజలు, యాగం నిర్వహించింది. సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ చిత్రాల్లో నటించిన నిధి అగర్వాల్ (Nidhi Aggarwal) కు ఇటీవల సినిమా అవకాశాలు బాగా నెమ్మదించాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’లో మాత్రమే ఆమె నటిస్తోంది.
వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వేణు స్వామి బాగా ఫేమస్ అయ్యారు. సమంత, నాగచైతన్య విడాకుల గురించి ముందే చెప్పారు. అప్పట్లో ఆయనపై విమర్శలు వచ్చినా.. చెప్పింది నిజం కావడంతో ఇంకా పాపులర్ అయ్యారు. మరికొందరు ప్రముఖుల జీవితాలపై వేణుస్వామి చెప్పిన కొన్ని విషయాలు నిజముగా జరిగాయి.
దాంతో ఆయన మాటలపై చాలా మందికి నమ్మకం కుదిరింది. గత కొంతకాలంగా టాలీవుడ్ ప్రముఖులు వేణుస్వామి ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారని సమాచారం. ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్న కూడా వేణుస్వామితో పూజలు చేయించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
Also Read: Samantha Ruth Prabhu: నేను ఎవరిని అడుక్కోను.. వారు ఇచ్చినంత తీసుకోవడమే..