Pan India Movies: పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చెస్తారంట..?
- By HashtagU Desk Published Date - 04:08 PM, Sat - 5 February 22

టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేసేందుకే ఆశక్తి చూపిస్తున్నారు. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా హీరోగా అవతారం ఎత్తిన ప్రభాస్, ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. సాహో, రాధ్యేశ్యామ్, ఆదిపురుష్, సలార్ ఇలా చెప్పుకుంటూపోతే, ప్రభాస్ వరుసబెట్టి మరీ పాన్ ఇండియా నటిస్తున్న సంగతి తెలిసిందే
ఇటీవల టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్‌గా ప్రమోషన్ పొందాడు. పుష్ప సినిమా ముందు కేవలం సౌత్ స్టార్‌గా ఉన్న బన్నీ, పుష్ఫ చిత్రం తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో మెగా హీరో రామ్ చరణ్, నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌లు కూడా పాన్ ఇండియా స్టార్లుగా మారనున్నారు. అలాగే యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా లైగర్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మరోమెట్టు ఎక్కనున్నాడు. ఒక్కసారి పాన్ ఇండియా మూవీలో నటించాక, హీరోలు లోకల్ సినిమాల పై ఆశక్తి చూపించడంలేదు.
ఈ క్రమంలో మన తెలుగు స్టార్ హీరోలు గతంలో ఓకే చేసిన కథలను రిజెక్ట్ చేస్తున్నారని టాలీవుడ్‌లో టాక్. పాన్ ఇండియా మోజుతో, తారక్ అయితే ఏకంగా త్రివిక్రమ్ చెప్పిన కథనే రిజెక్ట్ చేసి, కొరటాల శివ చెప్పిన పాన్ ఇండియా సబ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో సబ్జెట్ లేకపోవడంతో, వేణు శ్రీరామ్‌తో చేయాల్సిన ఐకాన్ సినిమా అల్లు అర్జున్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. వెంకీ కుడుములతో రామ్ చరణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే లోకల్ స్క్రిప్ట్ కావడం చరణ్ రిజెక్ట్ చేశారట. విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా కథలను మాత్రమే వింటున్నాడట. అలాగే టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలే కాకుండా, మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా మూవీస్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
Related News

Allu Arjun: అల్లు అర్జున్ కు అస్వస్థత.. రెండు వారాల పాటు ‘పుష్ప 2’ షూటింగ్ వాయిదా..?!
'పుష్ప' తర్వాత సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. 'పుష్ప 2' చిత్రానికి సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.