Allu Ramesh : టాలివుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..
పలు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నటుడు అల్లు రమేష్(Allu Ramesh) నేడు ఉదయం గుండెపోటుతో మరణించారు.
- By News Desk Published Date - 07:15 PM, Tue - 18 April 23
ఇటీవల గత కొంతకాలంగా టాలీవుడ్(Tollywood) లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారు. తాజాగా మరో నటుడు(Actor), కమెడియన్(Comedian) కన్నుమూశారు. పలు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నటుడు అల్లు రమేష్(Allu Ramesh) నేడు ఉదయం గుండెపోటుతో మరణించారు.
విశాఖకు చెందిన అల్లు రమేష్ నాటకాలు వేస్తూ అనంతరం సినిమాల్లోకి వచ్చారు. మొదట చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగారు. సిరిజల్లు, కేరింత, తోలుబొమ్మలాట, మధురవైన్స్, రావణదేశం, నెపోలియన్.. లాంటి పలు సినిమాల్లో నటించారు. సినిమాలే కాకుండా యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. దాదాపు పదేళ్లుగా సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నారు రమేష్.
నటుడు అల్లు రమేష్ ఇలా సడెన్ గా గుండెపోటుతో మరణించడంతో ఆయనతో పనిచేసిన నటీనటులు, టెక్నిషన్స్, పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియచేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.
Also Read : Samantha: శాకుంతలం రిజల్ట్ పై స్పందించిన సమంత.. పోస్ట్ వైరల్?