Janhvi Kapoor: ఆ కామెంట్స్ నన్ను తీవ్రంగా బాధించాయి: జాన్వీ కపూర్
విమర్శలను తాను ఎలా ఎదుర్కొంటానో జాన్వీ (Janhvi Kapoor) వెల్లడించింది
- Author : Balu J
Date : 09-02-2023 - 3:13 IST
Published By : Hashtagu Telugu Desk
2022లో విడుదలైన గుడ్‌లక్ జెర్రీ, మిలీ చిత్రాలతో విజయాన్ని అందుకున్న జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నిత్యంలో వార్తల్లో కనిపిస్తుంటుంది. దివంగత సీనియర్ నటి శ్రీదేవి, సినీ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె, అర్జున్ కపూర్ సోదరి అయిన జాన్వీ కపూర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ (Trollings) బారిన పడటం పరిపాటిగా మారింది. తాజాగా ఈ బాలీవుడ్ (Bollywood) బ్యూటీని నెటిజన్స్ బంధుప్రీతి కి బచ్చి?” అని కామెంట్ చేయడం వల్ల ఎంతగానో బాధపడ్డానని జాన్వీ అంటోంది.
విమర్శలను తాను ఎలా ఎదుర్కొంటానో జాన్వీ (Janhvi Kapoor) వెల్లడించింది. తాను నవ్వగలిగే స్థాయికి చేరుకున్నందుకు కృతజ్ఞతగా పేర్కొంది. “నా బలాలు, బలహీనతలు నాకు తెలుసు. నేను ఎప్పుడు మంచి పని చేశానో, ఎప్పుడు చేయకపోయినా తెలుసుకోవాలనే లక్ష్యంతో ఉన్నా. నేను గత రెండు సినిమాల నుంచి ఎంతో నేర్చుకున్నా’’ అని చెప్పింది.
ఎవరైనా తన పనిని మెచ్చుకుని, సరైన అభిప్రాయాన్ని వ్యక్తపర్చినప్పుడు తాను అలాంటివారిని గౌరవిస్తానని కూడా ఈ బ్యూటీ (Janhvi Kapoor) పేర్కొంది. ‘మిలీలో మీరు బాగా నటించారు, కానీ మీరు మరొక చిత్రంలో మీ నటన (Acting)ను మెరుగుపరుచుకోవచ్చు’ అని ఎవరైనా చెబితే, నేను దానిని గౌరవిస్తాను” అని జాన్వీ అంటోంది. ఈ బ్యూటీ నటించిన గుడ్‌లక్ జెర్రీ, మిలీ చిత్రాలు ప్రేక్షకుల మంచి ఆదరణ పొందాయి. జాన్వీ నటనకు నటనకు ప్రశంసలు అందుకుంది. ఆమె 2018లో ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ధడక్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
Also Read: MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా.. షెడ్యూల్ ఇదే!