HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >These Are The Important Events That Changed Megastar Career

Megastar: మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌‌ లో టర్నింగ్ పాయింట్స్ ఇవే..!

ఒక్కడిగా వచ్చి.. ఒకటిగా మొదలుపెట్టి.. ఒక్కొక్కటి సాధిస్తూ.. ఒకటో స్థానంలో రెండు దశాబ్దాలుకు పైగా నిలబడ్డ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ (Megastar) చిరంజీవి పుట్టిన రోజు.

  • Author : Gopi Date : 22-08-2023 - 6:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Megastar
Megastar Chiranjeevi comments on Cancer goes viral

Megastar: ఒక్కడిగా వచ్చి.. ఒకటిగా మొదలుపెట్టి.. ఒక్కొక్కటి సాధిస్తూ.. ఒకటో స్థానంలో రెండు దశాబ్దాలుకు పైగా నిలబడ్డ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ (Megastar) చిరంజీవి పుట్టిన రోజు. అయితే ఆయన కెరీర్‌‌ లో కొన్ని సంఘటనలు ఆయన జీవితాన్నే మార్చేశాయి. అవేంటో ఒకసారి చూద్దాం..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి సినిమా ప్రాణం ఖరీదు. అప్పటికే పునాది రాళ్లు మొదలైనా తొలి విడుదల మాత్రం ప్రాణం ఖరీదే.
ప్రాణం ఖరీదు తర్వాత దాదాపు 20 సినిమాలు చేసినా చిరంజీవికి హీరోగా తగిన గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో 1982లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిందే ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్య సినిమా. చిరుకు గుర్తింపుతో పాటు మార్కెట్ కూడా తీసుకొచ్చింది.

మూవీస్ తో బిజీగా ఉన్న చిరు 1980లో సురేఖతో వివాహం జరిగింది. అప్పటికే చిరు 10 సినిమాలకు పైగా నటించారు. అల్లు రామలింగయ్య గారి అల్లుడు అయ్యాక మరింతగా కలిసి వచ్చింది అని అని చెప్పొచ్చు. మెగాస్టార్ క్రమశిక్షణ,సినిమాపై పిచ్చి ప్రేమ వలనే చిరు అనతికాలంలోనే అగ్ర స్థానానికి చేరుకున్నారు. 1983లో చిరంజీవి కెరీర్‌ను మార్చేసిన సినిమా ఖైదీ. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంతో నెంబర్ వన్ వైపు తొలిసారి అడుగులు వేశాడు చిరంజీవి.

Also Read: Chiranjeevi Birthday Special : టాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

1988లో మ‌ర‌ణ మృదంగం సినిమా షూటింగ్‌ను చెన్నైలో చిత్రీక‌రిస్తున్నారు. ఆ సమయంలో ఓ అభిమాని వ‌చ్చి తన పుట్టిన‌రోజు అని కేక్‌ను తినిపించబోయాడు. ఆ కేక్‌లో ఏదో రంగురంగుల ప‌దార్థాలు క‌నిపించాయి. మెగాస్టార్ మేక‌ప్ వేసుకునే స‌మ‌యంలో గ‌మ‌నిస్తే చిరంజీవి పెదాలు నీలి రంగులోకి మారాయి. డాక్ట‌ర్స్ ద‌గ్గ‌ర‌కు వెళ్లగా ఇది విష ప్రయోగం అని చెప్పారు. అప్పటి నుంచి బయటి ఫుడ్ అస్సలు తినరట చిరు. 1985లో చిరంజీవి అనే చిత్రంలో విలన్‌గా నటించాడు మెగాస్టార్.

1998లో వర్మతో ఒక సినిమా సైన్ చేశాడు చిరంజీవి. రెండు పాటలు కూడా చిత్రీకరించారు. కానీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. 1991లో గ్యాంగ్ లీడర్ మూవీ అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నింటినీ చెరిపేసింది. 2008లో రాజకీయ పార్టీ స్టార్ట్ చేసి దశాబ్దం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి.

2017లో రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెం 150తో మళ్లీ తనేంటో నిరూపించుకున్నారు మెగాస్టార్. 2022లో ఇక సినిమాలకు దూరం కానని ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేశారు చిరంజీవి. ప్రస్తుతం రెండు సినిమాలతో చిరు బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • Chiranjeevi Birthday
  • megastar
  • megastar chiranjeevi
  • tollywood

Related News

Ibomma Ravi

iBOMMA: టాలీవుడ్‌కి బిగ్‌షాక్‌.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ

టాలీవుడ్ కి మరోషాక్. తెలుగు సినీ పరిశ్రమను కొన్నేళ్లుగా పీడిస్తున్న పైరసీ భూతం ‘ఐబొమ్మ’ (iBomma) మళ్లీ ప్రత్యక్షమైంది. ఈ నెట్‌వర్క్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడంతో అంతా సద్దుమణిగిందని భావించిన టాలీవుడ్ పెద్దలకు ఈ పరిణామం పెద్ద షాక్ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు ఐబొమ్మ కీలక సూత్రధారి రవిని అరెస్ట్ చేసినప్పుడు, పైరసీకి అడ్డుకట్ట పడిందని సినీ ప

  • Megastar's New Look Goes Viral

    Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్ వైరల్

  • Tanikella Bharani's Emotion

    Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

  • Faria Abdullah's Shocking Comments on Marriage

    Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

  • Chiranjeevi Creates a Buzz on the Peddi Sets

    Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

Latest News

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

  • H-1B Visa: హెచ్‌–1బీ వీసాలు పై వేతనాలు..!

  • MLC Anantha Babu: మరో వారంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వర్ధంతి.. జగన్ స్నేహితుడు అనంతబాబు జైలుకి

  • Puttaparthi: సీమకు రాయల్ కల…. పుట్టపర్తిలో AMCA గర్జన!

  • కడపలో అల్లర్ల వెనుక వైసీపీ స్కెచ్…. కూటమి సర్కార్‌పై కుట్ర…!!

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd