HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Chiranjeevi Birthday Special 2023

Chiranjeevi Birthday Special : టాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

తెలుగు సినిమాను శ్వాసించి శాసిస్తున్న చిరంజీవి (Chiranjeevi) గురించి ఎంత చెప్పినా తక్కువే. చిరంజీవి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. చిరంజీవి కష్టంతో ఎదిగిన హీరో కాదు, ఇష్టంతో ఎదిగిన హీరో.

  • By Sudheer Published Date - 12:11 AM, Tue - 22 August 23
  • daily-hunt
Chiranjeevi Birthday 2023
Chiranjeevi Birthday 2023

Mega Star Chiranjeevi Birthday Special : ఒక్కడిగా వచ్చి.. ఒకటిగా మొదలుపెట్టి.. ఒక్కొక్కటి సాధిస్తూ.. ఒకటో స్థానంలో రెండు దశాబ్దాలుకు పైగా నిలబడ్డ వెండితెర ఇలవేలుపు. పరిచయం అక్కర్లేని పేరు.. అభిమానుల హృదయమే ఆయన ఊరు. ఎప్పటికి నిలిచిపోయే కీర్తి సంతకం. హిమాయలను తలదన్నే ఆయన వ్యక్తిత్వం. ఎంత ఎదిగిన ఒదిగి ఉండడమే ఆయన శక్తి. ఆయనొవరో కాదు మన తెలుగు చిత్ర గాడ్ ఫాదర్..అన్నయ్య..పద్మభూషణ్ డాక్టర్. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) పుట్టిన రోజు ఈరోజు.

తెలుగు సినిమాను శ్వాసించి శాసిస్తున్న చిరంజీవి (Mega Star Chiranjeevi) గురించి ఎంత చెప్పినా తక్కువే. చిరంజీవి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. చిరంజీవి కష్టంతో ఎదిగిన హీరో కాదు, ఇష్టంతో ఎదిగిన హీరో. చిరంజీవి అంటేనే ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. హీరో అవ్వాలని ఆశ పడే అతి సాధారణ కుర్రాళ్లకు నిజమైన ఆదర్శం. అన్నిటికీ మించి ప్రతి అవకాశంలోనూ ప్రతిభను కనబరచాలని చూసే ఏకైక హీరో.. మన చిరంజీవి.

తెలుగు సినిమా (Telugu Film) అంటే ఇలాగే ఉంటుందని అనుకుంటున్నా సమయంలో తెలుగు సినిమాకు అదిరిపోయే స్టెప్పులు నేర్పించింది చిరంజీవి.. తెలుగు హీరోకు ఓ స్టైల్‌ ఇచ్చింది చిరంజీవి.. డైలాగ్‌ డెలివరీని మరో రేంజ్‌కు తీసుకెళ్లింది చిరంజీవి.. థియేటర్లలో విజిల్స్‌ మోత మోగించింది చిరంజీవి..బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ మోత మోగించింది చిరంజీవి..తెలుగు సినిమా సత్తా ను చాటింది చిరంజీవి..ఆపదలో ఉన్న వారికీ నేనున్నాన్నది చిరంజీవి. ఇలా ఎక్కడికెళ్లినా..ఎక్కడ ఉన్న..చిరంజీవే.

సాధారణ నటుడి నుంచి మెగాస్టార్‌ (Mega Star Chiranjeevi) స్థాయికి ఎదగడమంటే అంత ఈజీ కాదు. నటనపై ఆసక్తితో ఎన్నో కష్టాలను ఎదుర్కొని..ఎన్నో అవమానాలను ఎదుర్కొని.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. నేడు ఎంతోమంది అభిమానులను సంపాదించిన చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన సినీ జీవితమే కాదు.. వ్యక్తిత్వం కూడా ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంది. అయితే, చిరుకు ‘22’ నెంబరుతో విడదీయలేని అనుభూతి ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. చిరంజీవి ఆగస్టు 22న పుట్టిన సంగతి తెలిసిందే. అయితే.. నటుడిగా రంగ ప్రవేశం చేసిన రోజు సెప్టెంబరు 22. ‘‘22 ఆగస్టు నేను పుట్టిన రోజైతే.. 22 సెప్టెంబరు నటుడిగా నేను పుట్టిన రోజు. కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికి నన్ను నటుడిగా పరిచయం చేసిన మీ ఆశీస్సులు పొందిన రోజు. నేను మరిచిపోలేని రోజు’’ అని ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు.

చిరంజీవి (Mega Star Chiranjeevi First Chance) మొదటి ఛాన్స్ :

చెన్నైలోని విజయరాఘవ రోడ్‌లో.. 11వ నెంబర్ ఇంట్లో చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్‌లు అద్దెకు ఉండి సినిమా అవకాశాల కోసం ట్రై చేసేవారు. ఓ రోజు సుధాకర్‌కు ‘పునాదిరాళ్లు’ సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది. అదే సమయంలో తమిళంలో ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా నుంచి సుధాకర్‌కు పిలుపు వచ్చింది. దీంతో ‘పునాదిరాళ్లు’ సినిమా వదిలేయాలని సుధాకర్ నిర్ణయించుకున్నారు. తనకు వచ్చిన తమిళ సినిమా అవకాశం గురించి చెప్పేందుకు సుధాకర్.. చిరంజీవితో కలిసి ‘పునాది రాళ్లు’ దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్‌ను కలిశారు. సుధాకర్ చెప్పింది విని రాజ్‌కుమార్ నిరుత్సాహానికి గురయ్యారు. పక్కనే ఉన్న చిరంజీవిని చూసి మీరు కూడా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థే కదా అని అడిగారు. ఆ పాత్రలో మీరు చేస్తారా? అని అడిగారు. దీంతో చిరంజీవి.. సుధాకర్ వైపు ప్రశ్నార్థకంగా చూశారు. సుధాకర్ ఒప్పుకోమని సైగ చేయడంతో చిరంజీవి అంగీకరించారు. అలా చిరంజీవికి తొలి సినిమా అవకాశం దక్కింది. అయితే, ‘పునాది రాళ్లు’ కంటే ముందే ఆయన నటించిన రెండో చిత్రం ‘ప్రాణం ఖరీదు’ ముందుగా రిలీజ్ అయ్యింది.

ఎన్టీఆర్ (NTR) కు దక్కని ఘనత చిరంజీవి (Mega Star Chiranjeevi )కి దక్కింది :

కెరీర్ మొదట్లో చిరంజీవికి హీరోగా అసలు గుర్తింపే రాలేదు. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. విలన్ పాత్రల్లో కూడా నటించి మెప్పించాడు. చివరకు తనలోని ప్రతిభనే నమ్ముకొని హీరోగా సక్సెస్ అయిన అసలు సిసలు హీరో అనిపించుకున్నాడు. ఇక్కడ ఒక విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సొంతంగా హీరో అయినవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ, తన కుటుంబం నుంచి డజను మందిని హీరోలను చేసిన ఘనత ఒక్క చిరంజీవికే దక్కుతుంది. ఈ ఘనత మహా నటుడు ఎన్టీఆర్ కే సాధ్యం కాలేదు.

మెగా స్టార్ బిరుదు (Mega Star Title) :

1978లో ప్రాణం ఖరీదు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన చిరంజీవి.. కెరియర్ మొదట్లో విలన్‌ పాత్రలు కూడా వేశాడు. ఈ మెగాస్టార్‌ బిరుదు చిరంజీవి అంత సులువుగా ఏమీ దక్కలేదు. టాలీవుడ్‌లో అతని ప్రయాణం పూలపాన్పు ఏమీ కాదు. ఇప్పుడు టాలీవుడ్‌కు గాడ్‌ఫాదర్‌లా మారాడేమో కానీ.. నాలుగు దశాబ్దాల కిందట ఎలాంటి గాడ్‌ఫాదర్‌ అండ లేకుండా చిరు సాగించిన ప్రయాణం ఎందరికీ స్ఫూర్తిదాయకం. టాలీవుడ్‌లో చిరంజీవిది ఓ ప్రత్యేక అధ్యాయం. అతని నటన, అతని క్రమశిక్షణ, అతని వ్యక్తిత్వం.. అన్నీ ప్రత్యేకమే. ఈ ప్రత్యేకతే కెరీర్‌లో అతనికి ఎన్నో అవార్డులు, రివార్డులు, పేరుప్రఖ్యాతలు వచ్చేలా చేసింది.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల తర్వాత నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమాను ఏలుతూ ఇప్పటికీ యువ హీరోలకు పోటీ ఇస్తున్న చిరంజీవికి అప్పుడే 67 ఏళ్లు నిండాయంటే నమ్మశక్యం కాదు.

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు స్థాపన (Chiranjeevi Charitable Trust (CCT)) :

వెండితెరపై చిరంజీవి చేసిన సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తే, నిజ జీవితంలో ఆయన చేసిన సహాయ కార్యక్రమాలు ప్రాణాలు నిలిపాయి. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో 1998లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టును స్థాపించారు. ఈ ట్రస్టు కింద చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ లు (Chiranjeevi Eye and Blood Bank) ఉన్నాయి.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా కోట్లాది మంది సాయం పొందారు. ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. అటు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి గానీ, ఇటు తన అభిమానులకు గానీ ఏ కష్టమొచ్చినా నేనున్నాను అంటూ ఎప్పుడు ముందుంటారు. కరోనా సమయంలో చిరంజీవి అందించిన సాయం అందరికీ తెలిసిందే.

గోదావరి వరద ప్రాంతాలకు చిరంజీవి మెగా సాయం (Chiranjeevi Help) :

1988లో యముడికి మొగుడు సినిమా సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతుండగా అక్కడికి వచ్చిన పత్తి రైతులు, పంట నష్టం కారణంగా నష్టపోయామని మొరపెట్టుకోవడంతో అప్పటికప్పుడు 2లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చేసారు. 1989లో రుద్రవీణ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఆ అవార్డుకు వచ్చిన 30వేల రూపాయలకు మరో 20వేలు కలిపి 50వేల మొత్తాన్ని నర్గీస్ దత్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి విరాళంగా ఇచ్చారు. 1996లో గోదావరికి వరదలు రావడంతో ఆయా ప్రాంతంలోని జనాలకు తినడానికి బియ్యం, సరుకులు మొదలగు వాటన్నింటినీ చిరంజీవి పంపించారు.

చిరంజీవి గురించి చాలామందికి తెలియని విషయాలు (Facts about Chiranjeevi):

ఆస్కార్ అవార్డులకు అతిథిగా మెగాస్టార్ : 1987లో ఆస్కార్ అవార్డ్స్ పురస్కారానికి అతిథిగా చిరంజీవికి ఆహ్వానం అందింది. దక్షిణ భారత హీరోల్లో ఆస్కార్ అవార్డ్స్ అహ్వానం అందుకున్న మొట్టమొదటి హీరో చిరంజీవి.

ఇంగ్లీషులో డబ్బింగ్:

చిరంజీవి నటించిన కొదమ సింహం సినిమాను ఇంగ్లీషులో అనువాదం చేసారు.

కోటి రూపాయల పారితోషికం:

మెగాస్టార్ చిరంజీవి మొదటిసారిగా ఆపద్బాంధవుడు సినిమాకు కోటి రూపాయల పారితొషికాన్ని అందుకున్నారు. అప్పట్లో బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ కన్నా ఎక్కువ పారితోషికం అందుకున్న మొదటి హీరోగా చిరంజీవి నిలిచారు.

హాలీవుడ్ లో అవకాశం :

1999 సంవత్సరంలో చిరంజీవికి హాలీవుడ్ లో అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు.

చిరంజీవి అవార్డ్స్ (Chiranjeevi Awards) :

చిరంజీవి ప్రస్థానంలో మూడు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ బహుమతులు అందుకున్నారు. 2006 లో చిరంజీవికి చలన చిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇచ్చింది.

చిరంజీవి సహ-నిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ చిత్రం జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది. 2002లో భారత కేంద్రప్రభుత్వ ఆర్థిక శాఖ 1999-2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుగా సమ్మాన్ పురస్కారాన్ని ప్రకటించింది. 2006 లో సి.ఎన్.ఎన్. ఐబిఎన్ నిర్వహించిన సర్వేలో తెలుగు చిత్రపరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా గుర్తించింది.

టాలీవుడ్ లో ఫస్ట్ టైం రూ.10 కోట్లు సాధించిన చిత్రం చిరంజీవిదే..

1992 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రం 10 కోట్ల రూపాయలకు పైగా స్థూల వసూళ్ళు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. 1993 లో జరిగిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీం విభాగంలో ఘరానా మొగుడు ప్రదర్శింపబడింది. ఈ సినిమాతో చిరంజీవి భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా జాతీయ వారపత్రికల ముఖచిత్రంపై ఎక్కాడు. ఫిల్మ్ ఫేర్, ఇండియా టుడే పత్రికలు చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్తో పోలుస్తూ బిగ్గర్ దాన్ బచ్చన్ అని శీర్షికలు వెలువరించాయి. ది వీక్ పత్రిక చిరంజీవిని ది న్యూ మనీ మెషీన్గా అభివర్ణించింది.

చిరంజీవి రాజకీయ ప్రవేశం  (Chiranjeevi Political Entry):

రాష్ట్రంలో అప్పటి వరకు రెండు ప్రధాన పార్టీల మధ్యే పోటీ ఉండేది. అవి సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకటి. రెండోది తెలుగు ప్రజల ఆత్మగౌరవ రక్షణ కోసం ఏర్పాటైన తెలుగుదేశం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మూడో పార్టీ ఆవిర్భవించింది. ఎన్నో చిన్నా చితక పార్టీలు ఉన్నప్పటికీ.. అవి ప్రధాన పార్టీలకు ఏమాత్రం పోటీనివ్వలేక పోయాయి.

ఈ నేపథ్యంలో మూడు దశాబ్దాల సినీ అనుబంధం అండదండలతో మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రజారాజ్యం పేరుతో చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి రాజకీయ రంగంతో రాష్ట్ర రాజకీయ రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ పార్టీలకు గట్టి పోటీనివ్వగలిగే మూడో పార్టీ ఆవిర్భవించిందనే భావన ప్రతి ఒక్కరిలో నెలకొంది. అదే స్థాయిలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం కూడా అదిరింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆయన పొలిటికల్ ఎంట్రీ దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ, విశ్వమాత మదర్ థెరిస్సా, సంఘ సంస్కర్త జ్యోతీరావ్ పూలేల ఆదర్శంగా తన రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు ఘనంగా ప్రకటించారు. ఇందుకోసం మదర్ థెరిస్సా జయంతి రోజైన ఆగస్టు 26వ తేదీన తన రాజకీయ పార్టీ పేరు, జెండా, విధి విధానాలను అశేష జనసందోహం మధ్య ప్రకటించారు. కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల తిరుపతిలోని ఆవిలా చెరువు మైదాన్ని వేదికగా చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా.. దేశ రాజకీయ చిత్రపటంలో ఎన్నడూ లేని విధంగా చిరు బహిరంగ సభకు ఆయన అభిమానులు తరలి వచ్చి, ఆశీర్వదించారు.

అలా రాజకీయ ప్రవేశాన్ని తనదైన శైలిలో ప్రారంభించిన చిరంజీవి.. ఆ తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల్లో గుబులు పుట్టించారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగారు. తమ పార్టీ విధివిధానాలను స్పష్టంగా వెల్లడించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తామని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. సంక్షేమ పథకాల అమలు ముసుగులో జరుగుతున్న అవినీతిని తూర్పారబట్టారు.

సెజ్‌లకు వ్యతిరేకం కాదంటూనే.. వ్యవసాయ భూములు అప్పగించబోమని స్పష్టం చేశారు. అలాగే.. ఆరంభంలో అదగొట్టిన చిరంజీవి.. ఆ తర్వాత తాను చేపట్టిన ప్రజా అంకిత యాత్రల ద్వారా తన సత్తా చాటారు. చిరు యాత్రల పొడవునా రాష్ట్ర ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు. మొత్తం మీద చిరంజీవి రాజకీయ ప్రవేశంతో రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ పార్టీ ఏర్పడింది.

చిరంజీవి పదేళ్ల పాటు సినిమాలకు దూరం (Chiranjeevi away from films for Ten Years) :

2007లో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ తర్వాత సుమారు పదేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. ఈ సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ పదేళ్ళలో అడపా దడపా అతిథి పాత్రల్లో కనిపించాడు. 2009 లో కొడుకు రాంచరణ్ నటించిన మగధీర, 2015లో వచ్చిన బ్రూస్ లీ చిత్రాల్లో తన నిజ జీవిత పాత్రల్లో కనిపించాడు. 2010 లో వచ్చిన వరుడు, 2015లో వచ్చిన రుద్రమదేవి చిత్రాల్లో నేపథ్య సంభాషణకు తన గాత్రం అందించాడు. 2001 లో వచ్చిన శ్రీమంజునాథ చిత్రంలో శివుడి పాత్రలాగానే 2013 లో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర చిత్రంలో శివుడిగా అతిథి పాత్రలో కనిపించాడు.

చిరంజీవి రికార్డ్స్ (Chiranjeevi Records) :

చిరంజీవి హీరో గా నటించిన ఖైదీ చిత్రం అప్పట్లో సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు..అప్పటి వరకు కేవలం ఒక మామూలు హీరో గా ఉన్న చిరంజీవి ఈ సినిమాతో స్టార్ హీరో అయ్యాడు..అంతే కాదు..అప్పట్లోనే నాలుగు కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన మొట్టమొదటి తెలుగు సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది ఖైదీ..ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఖైదీ చిత్రం తర్వాత చిరంజీవి ని మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘పసివాడి ప్రాణం’..ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటన అద్భుతం..కామెడీ తో పాటు సెంటిమెంట్ ని కూడా గుండెల్ని పిండేసేలా చేసింది ఈ చిత్రం..అప్పట్లో ఈ సినిమాకి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది..అంతే కాదు కమర్షియల్ సినిమా విలువలని కూడా బాగా పెంచింది ఈ చిత్రం.

చిరంజీవి సోషియో ఫాంటసీ నేపథ్యం లో తీసిన ‘యముడికి మొగుడు’ అనే చిత్రం అప్పటి వరకు ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఈ చిత్రానికి ఆ రోజుల్లోనే దాదాపుగా ఆరు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

చిరంజీవి నుండి వచ్చిన మరో ఇండస్ట్రీ హిట్ ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’..సరికొత్త జానర్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసి ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది..ఈ చిత్రం ఆరోజుల్లో దాదాపుగా 7 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిందట..ఇక ఇదే సినిమాని తమిళం లో సూపర్ స్టార్ రజినీకాంత్ రీమేక్ చేసాడు..అక్కడ కూడా మంచి సక్సెస్ ని సాధించింది.

తెలుగు సినిమా స్థాయిని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. ఆరోజుల్లో ఈ సినిమా బాహుబలి రేంజ్ అన్నమాట..మళ్ళీ ఈ రికార్డ్స్ ని ఎవ్వరు కొట్టలేరని అనుకునే వాళ్ళు..చిరంజీవి కి పాన్ ఇండియా లెవెల్ లో ఫేమ్ కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత ఆయన బాలీవుడ్ లో కూడా వరుసగా నాలుగు చిత్రాల్లో హీరో గా నటించాడు..ఈ సినిమా విడుదలైనప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో వరదలు ఉండేవి..కానీ థియేటర్స్ వద్ద కలెక్షన్స్ వరద కూడా ఆగలేదు..అప్పట్లోనే సుమారుగా 9 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది.

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రికార్డ్స్ ని ఇప్పట్లో ఎవ్వరు అందుకోలేరు అని అనుకుంటున్న సమయం లో ఆ మరుసటి సంవత్సరం లోనే ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు మెగాస్టార్..ఈ సినిమా చిత్రం కూడా అదే రేంజ్ వసూళ్లను రాబట్టింది..జగదేక వీరుడు సినిమాకంటే ఒక 50 లక్షల రూపాయిల షేర్ ని ఎక్కువ రాబట్టింది ఈ చిత్రం..ఇదే చిత్రాన్ని హిందీ ‘ఆజ్ కా గుండా రాజ్’ అని రీమేక్ చేసారు..అక్కడ కూడా చిరంజీవినే హీరో..ఆ ఏడాది ఈ చిత్రం టాప్ 10 బాలీవుడ్ సినిమాలలో ఒకటిగా నిలిచింది..దాంతో చిరంజీవి పేరు ఇండియా వైడ్ మారుమోగిపోయింది.

‘ఘరానా మొగుడు’. టాలీవుడ్ కి మొట్టమొదటి 10 కోట్ల రూపాయిల షేర్ సినిమా ఇదే..ఈ చిత్రం తో మెగాస్టార్ చిరంజీవి తిరుగులేని నెంబర్ 1 హీరో గా తన స్థానం ని ఫిక్స్ చేసుకున్నాడు..రెండు , మూడు రూపాయిల టికెట్ రేట్స్ తో పది కోట్ల రూపాయిలు అంటే ఇప్పటి లెక్క ప్రకారం ఎంత వసూళ్లను రాబట్టి ఉండేదో ఊహించుకోండి. ఆరోజుల్లో రెండు కోట్లకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయిన మొట్టమొదటి తెలుగు సినిమా ఇదే.

ఘరానా మొగుడు తర్వాత చాలా కాలం ఫ్లాప్స్ ని ఎదురుకున్నాడు..ఆ సమయం అందరూ పెద్ద పెద్ద హిట్స్ కొడుతున్నారు కానీ ఇండస్ట్రీ ని మరోలెవెల్ కి తీసుకెళ్లే హిట్స్ మాత్రం కొట్టలేకున్నారు..మధ్యలో నందమూరి బాలకృష్ణ నరసింహ నాయుడు సినిమాతో టాలీవుడ్ కి 20 కోట్ల రూపాయిల షేర్ మార్కెట్ ని ఓపెన్ చేసాడు.

వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న చిరంజీవికి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చిన సినిమా ఇంద్ర. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది..టాలీవుడ్ కి ఇదే మొట్టమొదటి 30 కోట్ల రూపాయిల సినిమా ఇది.

మూడు సార్లు వందకోట్ల రూపాయిల షేర్ కొల్లగొట్టిన ఏకైక హీరో చిరంజీవి :

మెగాస్థార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చేముందు మన టాలీవుడ్ లో ‘బాహుబలి’ మినహా ఒక్క సినిమా కూడా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకోలేదు..అలాంటి సమయం లో చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150 ‘ తో వంద కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన మొట్టమొదటి నాన్ రాజమౌళి హీరో గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

చిరంజీవి కి ఆయుధాలు లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ని పక్కపెట్టి ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం చేసాడు. ఈ సినిమా ఏకంగా 140 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.. ఇక ఆ తర్వాత వరుసగా రెండు ఫ్లాప్స్ తర్వాత ‘వాల్తేరు వీరయ్య‘ చిత్రం తో మూడవసారి వంద కోట్ల రూపాయిలను కొల్లగొట్టి, టాలీవుడ్ లో ప్రభాస్ తర్వాత మూడు సార్లు వందకోట్ల రూపాయిల షేర్ కొల్లగొట్టిన ఏకైక హీరో గా చిరంజీవి నిలిచాడు.

68 ఏళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోలతో సమానంగా డ్యాన్స్ వెయ్యడం, ఫైట్స్ చెయ్యడం , కామెడీ చెయ్యడం మాత్రమే కాదు.. వాళ్ళతో సరిసమానంగా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ కూడా పడుతున్నాడు.. ఇలాంటి స్టార్ హీరో ని ఎన్ని తరాలు మారిన చూడలేము ఏమో. సో ..మెగాస్టార్ చిరంజీవి గారికి మరోసారి మా Hashtag U టీం తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Read Also : Pawan Kalyan : ప్రేమ దేశం అబ్బాస్.. పవన్ కళ్యాణ్‌కి మంచి ఫ్రెండ్ అని మీకు తెలుసా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 Chiranjeevi Birthday
  • chiranjeevi
  • Chiranjeevi @ 68
  • Chiranjeevi Birthday
  • chiranjeevi birthday age
  • chiranjeevi birthday celebration
  • Chiranjeevi Birthday new films
  • Chiranjeevi Birthday news
  • chiranjeevi birthday party
  • chiranjeevi birthday photos
  • Chiranjeevi Birthday posters
  • Chiranjeevi Birthday Special
  • Chiranjeevi janasena
  • Chiranjeevi-pawan
  • Pawan Kalyan

Related News

Language barriers should be removed to benefit future generations: Pawan Kalyan

Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!

Pawan Kalyan : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పన్ను భారాన్ని తగ్గించే దిశగా తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వకంగా స్వాగతించారు.

  • Sugali Preethi Case Cbi

    Sugali Preethi Case : సీబీఐకి సుగాలి ప్రీతి కేసు

  • Ustaad Bhagat Singh

    Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ అప్డేట్‌.. అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ పోస్ట‌ర్‌!

  • Pawan- Bunny

    Pawan- Bunny: అల్లు అర‌వింద్ కుటుంబాన్ని పరామ‌ర్శించిన ప‌వ‌న్‌.. బ‌న్నీతో ఉన్న ఫొటోలు వైర‌ల్‌!

Latest News

  • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

  • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

  • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

Trending News

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd