HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >The Deserving Is First Hollywood Movie With Tollywood Talent

The Deserving: టాలీవుడ్ ప్రతిభతో తొలి హాలివుడ్ మూవీ “ది డిజర్వింగ్”

ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆధ్యాంతం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే సంచలనాత్మకమైన "ది డిజర్వింగ్" అనే చిత్రాన్ని తెలుగు హీరో వెంకట్ సాయి గుండ హాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ తెరకెక్కిస్తున్నాడు

  • Author : Praveen Aluthuru Date : 16-09-2023 - 6:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The Deserving
Logo (23)

The Deserving: ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆధ్యాంతం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే సంచలనాత్మకమైన “ది డిజర్వింగ్” అనే చిత్రాన్ని తెలుగు హీరో వెంకట్ సాయి గుండ హాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ తెరకెక్కిస్తున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నా ఈ సంచలనాత్మకమైన ప్రాజెక్ట్, సినిమా చరిత్రలో ఒక బెంచ్ మార్కును సెట్ చేయడానికి సిద్ధమౌతుంది. నటుడు వెంకట్ సాయి గుండ కేవలం ఈ సినిమాలో హీరోగానే కాదు నిర్మాతగా వ్యవహరిస్తూ హాలీవుడ్ లో తెలుగు ప్రతిభకు పట్టం కడుతున్న దార్శనీకుడు. ప్రపంచ మేధావుల కలయికతో వెండి తెరపై ఒక అద్భుతాన్ని ఆవిష్కరించడానికి వెంకట్ సాయి గుండ శ్రీకారం చుట్టారు. ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూసేలా ఈ చిత్రాన్ని తీర్చబోతున్న ఘనత వెంకట్ సాయి గుండకు చెందుతుంది. హాలీవుడ్ లో ప్రధానపాత్రదారుడిగా ఒక తెలుగు వాడు నటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

పాన్ వరల్డ్ చిత్రంగా తిరకెక్కుతున్న “ది డిజర్వింగ్” చిత్రంలో ప్రపంచ నలుమూలల నుండి ప్రఖ్యాతగాంచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేయడం గమనార్హం. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ద్వారా ప్రతిభవంతుడిగా గుర్తింపుని పొందిన ఎస్ ఎస్ అరోరా ఈ చిత్రానికి రచన దర్శకత్వం వహించారు. అలాగే ఎస్ ఎక్స్ ఎస్ డబ్ల్యూ ఫిలిం ఫెస్టివల్ తో సహా ప్రఖ్యాత అనేక ప్లాట్ ఫామ్స్ ల నుండి ప్రశంసలు పొందిన కోషి కియోకావా ఈ చిత్రానికి గ్రిప్పింగ్ కథనంతో పాటు సినిమాటోగ్రఫీ అందించారు. హాలివుడ్ లో ప్రఖ్యాత సిరీస్ ట్రాన్స్ఫార్మర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ స్టీవ్ జబ్లోన్స్కీ దగ్గర పని చేసి ఎన్నో అంతార్జాతీయ అవార్డులను కైవస్ చేసుకున్న ప్రసిద్ధ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ Nga  వెంగ్ చియో “ది డిజర్వింగ్” చిత్రానికి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ను అందించారు.

చిత్ర పరిశ్రమ పైన ప్యాషన్ తో హీరో వెంకట్ సాయి గుండ ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో నిర్మించడం ఒక చరిత్రాత్మకమైన పరిణామం. దీంతో టాలీవుడ్ హాలీవుడ్ కి మధ్య గొప్ప వారధిగా “ది డిజర్వింగ్” చిత్రం నిలవబోతుంది. ఈ చిత్రాన్ని ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్ర దర్శక నిర్మాతలు “ది డిజర్వింగ్” తీర్చిదిద్దారు. ఎప్పుడు కొత్తదనాన్ని ప్రత్సహించే వెంకట్ సాయి గుండ ఎక్కడా వెనకాడకుండా ఈ చిత్రాన్ని అత్యంత గొప్ప నిర్మాణ విలువలు అందించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది అని నిర్మాత నమ్మకంగా ఉన్నారు.

నటీనటులు: వెంకట్ సాయి గుండ, సిమోన్ స్టాడ్లర్, కెల్సీ స్టార్ట్లర్, తదితరులు
రచన & దర్శకత్వం: S.S అరోరా
ప్రొడక్షన్ హౌస్: కథా ప్రొడక్షన్స్
నిర్మాతలు: వెంకట్ సాయి గుండ, విస్మయ్ కుమార్, తిరుమలేష్ గుండ్రాత్
సంగీతం: Nga వెంగ్ చియో(Nga Weng Chio)
సినిమాటోగ్రఫీ: కోషి కియోకావా
పీఆర్ఓ: హరిష్, దినేష్

Also Read: Asian Games : ఆసియన్ గేమ్స్ సాఫ్ట్ టెన్నిస్ ఎంపికైన విజ‌య‌వాడ బాలిక‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Casting
  • The Deserving
  • tollywood
  • Venkat Sai Gunda

Related News

Sivaji Controversy Ram Char

చరణ్ కి బిగ్ షాక్.? శివాజీ వివాదం పై చికిరి చికిరి సాంగ్ లో కోత ! ఆ రెండు పదాలు తీసివేత ?

నటుడు శివాజీ ఇటీవల హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన ఇప్పటికే క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే తన మాటలకు కట్టుబడే ఉన్నానని శివాజీ తెలిపారు. తాను మాట్లాడిన మాటల్లో రెండు తప్పు పదాలు దొర్లాయని, దానికి మాత్రమే సారీ చెబుతున్నానని అన్నారు. అనూహ్యంగా ఈ వివాదంలోకి ‘పెద్ది’ సినిమా వచ్చి చేరింది. ఈ ఇష్యూలో శివాజీకి సపోర్ట్ చేస్తున్న స

  • Dhandoraa Movie Review

    శివాజీ దండోరా మూవీ రివ్యూ!

  • Animal

    జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌.. డేట్ కూడా ఫిక్స్‌!

  • Sivajii

    నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

  • Sivaji

    శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

Latest News

  • లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ!

  • విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్, విరాట్ సెంచరీలు.. ప్రత్యక్ష ప్రసారం ఎందుకు లేదు?

  • బంగ్లాదేశ్ ఎన్నికలు.. షేక్ హసీనా పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ!

  • డిప్యూటీ సీఎం పవన్ ఎఫెక్ట్.. భీమవరం డీఎస్పీపై బదిలీ వేటు !

  • దేశం మెచ్చిన నాయకత్వానికి చిరస్థాయి గౌరవం : సీఎం చంద్రబాబు

Trending News

    • మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!

    • క్రిస్మస్ కేక్ కథ.. గంజి నుండి ఫ్రూట్ కేక్ వరకు ఎలా మారింది?

    • టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కార‌ణ‌మిదేనా?

    • ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

    • సూర్యకుమార్ యాదవ్ తర్వాత భార‌త్ తదుపరి కెప్టెన్ ఎవరు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd