Tollywood : టాలీవుడ్‌లో లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్.. వేధింపుల విషయంలో మహిళలు మాకు కంప్లైంట్ చేయండి..
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇలాంటి లైంగిక వేధింపుల కేసుల గురించి ప్రెస్ మీట్ పెట్టింది.
- By News Desk Published Date - 03:09 PM, Tue - 17 September 24

Tollywood : జానీ మాస్టర్ కేసుతో టాలీవుడ్ లో సంచలనం నెలకొంది. ఈ కేసు బాగా వైరల్ అవ్వడంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇలాంటి లైంగిక వేధింపుల కేసుల గురించి ప్రెస్ మీట్ పెట్టింది. ఈ ప్రెస్ మీట్ లో జానీ మాస్టర్ కేసు గురించి మాట్లాడారు. అలాగే టాలీవుడ్ లో మహిళలపై లైంగిక వేధింపులు జరిగితే మాకు కంప్లైంట్ చేయండి అని కూడా ప్రెస్ మీట్ లో తెలిపారు. దీనికి సంబంధించిన ఓ లేఖని విడుదల చేసారు.
ఈ లేఖలో.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2018లో లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. మహిళా కొరియోగ్రాఫర్ నుంచి వచ్చిన ఫిర్యాదును మేము స్వీకరించాము. తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ & డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద వచ్చిన ఈ ఫిర్యాదును పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చేసాము. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. జానీ మాస్టర్ ని యూనియన్‌లో ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా తప్పిస్తున్నట్టు నివేదిక ఇచ్చాము. అని తెలిపారు.
అలాగే.. ఏదైనా లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో పరిశ్రమలోని మహిళలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం బయట ఫిర్యాదు పెట్టె ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు వాడుకొని ఏవైనా సమస్యలు ఉంటే అందులో వేయమని లేదా కొరియర్ ద్వారా.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డా. డి. రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్-500 096 అడ్రెస్ కు పంపమని లేదా వాట్సాప్ లేదా టెక్స్ట్ 9849972280 నంబర్ కు, complaints@telugufilmchamber.in మెయిల్ కి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఇక టాలీవుడ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్- లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ లో K.L. దామోదర్ ప్రసాద్, ఝాన్సీ, తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల, ప్రగతి మహావాది, రామలక్ష్మి మేడపాటి, కావ్య మండవ ఉన్నారు.
Also Read : NTR Devara : దేవర కోసం కొరటాల షాకింగ్ రెమ్యునరేషన్..!