Casting Couch : షూటింగ్ లో బాలకృష్ణ అసభ్యకరంగా ఇబ్బంది పెట్టాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్
- Author : Sudheer
Date : 22-11-2023 - 12:34 IST
Published By : Hashtagu Telugu Desk
నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఫై సంచలన వ్యాఖ్యలు చేసి నటి విచిత్ర (Tamil actress Vichitra) వార్తల్లో నిలిచింది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈమె ..బాలకృష్ణతో “భలేవాడివి బాసు” (Bhalevadivi Basu)అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ లో బాలకృష్ణ తనను అసభ్యకరంగా ఇబ్బంది పెట్టేవాడిని.. తన రూమ్ కి పిలిచాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాలను తమిళ బిగ్ బాస్ షో (Bigg Boss )లో కంటెస్టెంట్స్ తో పంచుకున్నారు. తాను ఓకే చెప్పకపోవడంతో నానా రకాలుగా ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చింది. అడవిలో షూటింగ్ సమయంలో తాను చెప్పుకోలేని చోట బాలకృష్ణ తాకాడని..ఈ విషయం డైరెక్టర్ కు, ఫైట్ మాస్టర్ కు చెబితే నన్ను కొట్టారని కన్నీరు పెట్టుకుంటూ తోటి కంటెస్టెంట్ కు చెప్పుకొని బాధపడింది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇది నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది. చిత్రసీమలో బాలకృష్ణ ఫై ఇలాంటి ఆరోపణలు వచ్చిన దాఖలాలు లేవు. మొదటిసారి ఓ హీరోయిన్ ఇలా చెప్పడం తో అంత మాట్లాడుకుంటున్నారు. మరి దీనిని రాజకీయ నేతలు ఏమైనా క్యాష్ చేసుకుంటారా అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం బాలకృష్ణ వరుస హిట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఈఏడాది వీర సింహ రెడ్డి , భగవత్ కేసరి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.
Read Also : Bellamkonda Sreenivas: ఛత్రపతి ఫెయిల్యూర్ ఎఫెక్ట్, ముంబై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్