Mamta Kulkarni : సన్యాసం తీసుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. కుంభమేళాలో సాధ్విగా మారిపోయి..
తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సన్యాసం తీసుకొని సాధ్విగా మారిపోవడంతో చర్చగా మారింది.
- By News Desk Published Date - 10:57 AM, Sat - 25 January 25

Mamta Kulkarni : ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. లక్షల మంది సాధువులు అక్కడికి వస్తున్నారు. అనేకమంది కొత్తగా సన్యాసం తీసుకొని సాధువులుగా మారుతున్నారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సన్యాసం తీసుకొని సాధ్విగా మారిపోవడంతో చర్చగా మారింది.
ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణి బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. హిందీతో పాటు తమిళ్, తెలుగు, బెంగాలీ, మరాఠీ భాషల్లో దాదాపు 50 సినిమాల్లో నటించింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగ పోలీస్ అనే సినిమాల్లో నటించింది. 2003 తర్వాత ఈమె సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత విక్కీ గోస్వామి అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అయితే అతను డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో అప్పట్నుంచి అతనికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం.
తాజాగా మమతా కులకర్ణి నిన్న ప్రయాగ్ రాజ్ వచ్చి అక్కడ కుంభమేళా స్నానమాచరించి ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మి నారాయణ త్రిపాఠి ఆశీర్వాదం తీసుకొని ఆయన సమక్షంలో సన్యాసం తీసుకొని సాధ్విగా మారింది. అనంతరం ఆమె పేరుని శ్రీ యామై మమతా నందగిరిగా మార్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మమతా సన్యాసం తీసుకున్న తర్వాత కూడా కాషాయ దుస్తుల్లో సాధ్విగా పలు వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
Also Read : Akhanda 2 : బాలయ్య అఖండ 2.. ప్రగ్యతో పాటు ఇంకో హీరోయిన్ కూడా..