Akhanda 2 : బాలయ్య అఖండ 2.. ప్రగ్యతో పాటు ఇంకో హీరోయిన్ కూడా..
అఖండ సినిమాలో ఉన్న ప్రగ్య జైస్వాల్ అఖండ 2లో కూడా ఉన్నాను అని ఇటీవల డాకు మహారాజ్ ఈవెంట్స్ లో చెప్పింది.
- By News Desk Published Date - 10:28 AM, Sat - 25 January 25

Akhanda 2 : బాలయ్య బాబు(Balakrishna) వరుస హిట్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సంక్రాంతికి డాకు మహారాజ్(Daaku Maharaaj) సినిమాతో వచ్చి వరుసగా నాలుగో హిట్ కొట్టాడు. నెక్స్ట్ అఖండ 2 షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నారు. ప్రస్తుతం బాలయ్య లేని సీన్స్ తో అఖండ 2 షూటింగ్ జరుగుతుంది. ఇటీవలే కుంభమేళాలో అఖండ 2 షూటింగ్ జరిగింది.
అఖండ సినిమాకు కొనసాగింపుగానే ఈ సినిమా ఉంటుంది. అయితే అఖండ సినిమాలో ఉన్న ప్రగ్య జైస్వాల్ అఖండ 2లో కూడా ఉన్నాను అని ఇటీవల డాకు మహారాజ్ ఈవెంట్స్ లో చెప్పింది. దీంతో అఖండ 2 సినిమాలో బాలయ్య సరసన ప్రగ్య కొనసాగింపు అలాగే ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందని సమాచారం.
తెలుగులో ఇటీవల వరుస హిట్ సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన మలయాళీ భామ సంయుక్త మీనన్ అఖండ 2 సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. మలయాళంలో పలు సినిమాలు చేసిన సంయుక్త తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బింబిసారా, సర్, విరూపాక్ష, డెవిల్.. ఇలా వరుసగా హిట్స్ కొట్టింది. ప్రస్తుతం స్వయంభు సినిమాలో నటిస్తుంది. తాజాగా అఖండ 2 సినిమాలో తీసుకున్నారు అని తెలుస్తుంది. దీంతో ఈ అమ్మడు మరింత బిజీ అయింది.
ఇప్పటికే సంయుక్త మీనన్ చేతిలో స్వయంభు సినిమాతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా, నారి నారి నడుమ మురారి సినిమాలు ఉండగా ఇప్పుడు అఖండ 2 చేరింది. ఈ సినిమాలు అన్ని కూడా హిట్ టాక్ తెచ్చుకునేలానే ఉన్నాయి. దీంతో సంయుక్త తెలుగులో స్టార్ అవ్వడం గ్యారెంటీ అంటున్నారు.
Also Read : Rajamouli : మహేష్ బాబు పాస్ పోర్ట్ సీజ్ చేసిన రాజమౌళి.. ప్రియాంక చోప్రా రిప్లై..