ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. స్పిరిట్ రిలీజ్ డేట్ ఇదే!
సందీప్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్' (Spirit) ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ చిత్రం మార్చి 5, 2027న థియేటర్లలో విడుదల కానుందని దర్శకుడు తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
- Author : Gopichand
Date : 16-01-2026 - 7:54 IST
Published By : Hashtagu Telugu Desk
Spirit Release Date: 2025లో పలు వివాదాల్లో చిక్కుకున్న తర్వాత సందీప్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit) ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ చిత్రం మార్చి 5, 2027న థియేటర్లలో విడుదల కానుందని దర్శకుడు తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
నూతన సంవత్సర సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకు ప్రభాస్, తృప్తి దిమ్రి నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. గతంలో ‘యానిమల్’ సినిమా విషయంలో అనుసరించిన సంప్రదాయాన్నే వంగా ఇక్కడ కూడా కొనసాగించారు. ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ‘యానిమల్’ తరహాలోనే రా అండ్ రస్టిక్ ఎనర్జీతో కనిపిస్తుండటం విశేషం.
Also Read: బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ.. కారణమిదే?!
NOTE THIS DATE……
MARCH 5th, 2027.
413 Days to go….#Spirit
— Spirit (@InSpiritMode) January 16, 2026
పోస్టర్ విశేషాలు
పోస్టర్‌లో ప్రభాస్ షర్ట్ లేకుండా వెనక్కి తిరిగి నిలబడి ఉన్నారు. ఆయన వీపు, భుజాలు, చేతులపై గాయాలు, కట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొడవాటి జుట్టు, దట్టమైన గడ్డం, మీసాలతో ఉన్న ప్రభాస్ లుక్ చూస్తుంటే నెటిజన్లకు ‘యానిమల్’లో రణబీర్ కపూర్ గుర్తుకు వస్తున్నారు. ప్రభాస్ ఒక చేత్తో ఆల్కహాల్ గ్లాస్ పట్టుకుని ఉండగా, తృప్తి దిమ్రి ఆయన సిగరెట్‌ను వెలిగిస్తూ కనిపిస్తున్నారు. ప్రభాస్ ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ “Spirit మొదటి పోస్టర్ ఇదిగో” అని రాసుకొచ్చారు.
సినిమా గురించి మరిన్ని వివరాలు
‘స్పిరిట్’ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించడమే కాకుండా రచన, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు అంతర్జాతీయ భాషలైన మాండరిన్, జపనీస్, కొరియన్ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
గతేడాది ప్రభాస్ 46వ పుట్టినరోజు సందర్భంగా ఐదు భారతీయ భాషల్లో ఈ సినిమా ఆడియో టీజర్‌ను విడుదల చేశారు. కాగా పని గంటల డిమాండ్ల కారణంగా దీపికా పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీపికా పేరు ఎత్తకుండానే సందీప్ వంగా ఆమె పిఆర్ స్ట్రాటజీని తప్పుబడుతూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ పాత్ర కోసం తృప్తి దిమ్రిని ఎంపిక చేశారు. తృప్తి ఇప్పటికే వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ (2023)లో నటించిన సంగతి తెలిసిందే.