Samantha : బాలీవుడ్ ను తాకిన సమంత క్రేజ్.. ఫొటోషూట్ పై కంగనా రియాక్షన్!
విడాకుల వ్యవహరం తర్వాత సౌత్ ఇండియన్ బ్యూటీ సమంత వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. రీసెంట్ గా ఓ మ్యాగజైన్ సమంత కవర్ ఫొటోలను పోస్ట్ చేసింది.
- By Balu J Published Date - 11:36 AM, Thu - 2 December 21
విడాకుల వ్యవహరం తర్వాత సౌత్ ఇండియన్ బ్యూటీ సమంత వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. రీసెంట్ గా ఓ మ్యాగజైన్ సమంత కవర్ ఫొటోలను పోస్ట్ చేసింది. ‘దక్షిణాదిలో 11 ఏళ్ల సినీ కెరీర్ తర్వాత సమంత ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో ఎలా మొదలు పెట్టిందో తెలుసుకోండి’ అంటూ సమంత పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే మ్యాగజైన్ కవర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూసి బాలీవుడ్ బ్యూటీ కంగనాను సైతం ఆశ్చర్యానికి వ్యక్తం చేసింది. “అందమైన మహిళ” అంటూ రాసుకొచ్చింది. దీనికి సమంత స్పందిస్తూ.. “@కంగనారానౌత్ థ్యాంక్యూ” అని సమాధానం ఇచ్చింది. కంగనానే కాకుండా… కీర్తి సురేష్, చిన్మయి శ్రీపాద లాంటివాళ్లు సమంతపై పొగడ్తల వర్షం కురిపించారు. హరోయిన్ తాప్సీ కూడా ఓ లైక్ వేసుకుంది.
When it comes to change, someone has to take the first step.#SamanthaPrabhu #BreakingStereotypes #BTS #Bollywood #Celebrityhttps://t.co/wyNdMG0gzJ
— ELLE India (@ELLEINDIA) December 1, 2021
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్స్ లలో సమంతా రూత్ ప్రభు ఒకరు. ఈ మధ్య తరుచుగా వార్తల్లోకి ఎక్కుతూ అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. తొలిసారిగా ‘పుష్ప’ లో ఐటం సాంగ్ చేయడం.. ఇతర సినిమాలతో పాటు హాలీవుడ్ లో కూడా ఛాన్స్ కొట్టేయడంతో సమంత క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మ్యాగజైన్ కవర్ కోసం చేసిన ఫోటోషూట్ అభిమానులకు విపరీతంగా నచ్చాయి. చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండటంతో సామ్ ఫ్యాన్స్ ‘వావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కంగనా, తాస్పీ లాంటి హీరోయిన్స్ సైతం రియాక్ట్ అవడంతో సమంత క్రేజ్ బాలీవుడ్ ను తాకిందని చెప్పక తప్పదు.
Related News
RGV : ఫస్ట్ టైమ్ తెలుగు దర్శకులతో ఆర్జీవి..!
RGV నిన్న మొన్నటిదాకా పొలిటికల్ ఎజెండాతో కొన్ని సినిమాలు చేసి సందడి చేసిన సంచలన దర్శకుడు ఆర్జీవి ఏపీలో ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి తను కూడా ఇప్పుడు ఒక దర్శకుడిని