Samantha : ఐ యామ్ స్ట్రాంగ్ అంటున్న సమంత!
లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ చాలా కామన్. కిందపడినప్పుడు కుంగిపోవద్దు. ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు విర్రవీగకూడదు. అన్నింటినీ సమానంగా స్వీకరిస్తూ పోవాలి.
- By Balu J Published Date - 01:19 PM, Tue - 2 November 21
![Samantha : ఐ యామ్ స్ట్రాంగ్ అంటున్న సమంత!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2021/11/hash-2-1.jpg)
లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ చాలా కామన్. కిందపడినప్పుడు కుంగిపోవద్దు. ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు విర్రవీగకూడదు. అన్నింటినీ సమానంగా స్వీకరిస్తూ పోవాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లగలం. ఇదంతా ఎందుకు అంటారా.. అదేనండీ సమంత గురించే. తన భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత నిరాశకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆమె వెంటనే తేరుకుని తీర్థయాత్రలకు చుట్టేస్తూ తనను తాను కొత్తగా తీర్చిద్దిద్దుకుంటోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో స్ఫూర్తిదాయకమైన సందేశాలను షేర్ చేయడం చాలా ఆసక్తిగా మారింది. తాజాగా ఇవాళ ‘నేను బలంగా ఉన్నాను’ అంటూ మరొక అఫర్మేషన్ పోస్ట్ పెట్టింది. అది తన అమ్మ చెప్పిన మాట అని కూడా ఆమె చెప్పింది. భర్త నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత ఇష్టమైన పర్యాటక ప్రాంతాలను విజిట్ చేసింది. పచ్చని చెట్లు, అందమైన నదులను చూస్తూ కొత్త ఉత్సాహంతో కనిపించింది. చార్ ధామ యాత్ర తర్వాత సమంత ఉత్తరాఖండ్ పర్యటన ముగించుకుని దుబాయ్‌కి వెళ్లింది.
అంతకుముందు సమంత పోస్ట్ ఒకటి వైరల్ అయ్యింది. ‘‘మీ కుమార్తెను ఎవరు పెళ్లి చేసుకుంటారోనని మీరు ఆందోళనపడొద్దు, ఆమె పెళ్లి రోజు కోసం డబ్బును ఆదా చేయకుండా, ఆమె చదువుకు ఖర్చు చేయండి. పెళ్లికి సిద్ధం చేయకుండా చదువుకు సిద్ధం చేయండి. జీవితంలో విషమ పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించాలో నేర్పించండి’’ అంటూ పోస్ట్ చేసింది.
Related News
![Mamitha Baiju : ప్రేమలు హీరోయిన్ తో మైత్రి మూవీ మేకర్స్..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/Premalu-Heroine-Mamitha-Baiju-Name-Backstory.jpg)
Mamitha Baiju : ప్రేమలు హీరోయిన్ తో మైత్రి మూవీ మేకర్స్..!
రెండు మూడు కథలు విన్నా అవేవి నచ్చలేదని తెలుస్తుంది. ఫైనల్ గా మైత్రి మూవీ మేకర్స్ తో మమితా సినిమా ఫిక్స్ అయ్యిందట. ఈ సినిమాలో కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్