Sai Durga Tej : కొత్త దర్శకుడితో మెగా మేనల్లుడు.. ఆ సినిమా పరిస్థితి ఏంటో..?
Sai Durga Tej విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ మేనమామ పవన్ కళ్యాణ్ తో చేసిన బ్రో కమర్షియల్ గా వర్క్ అవుట్ అయినా సినిమా అన్ని వర్గాల
- Author : Ramesh
Date : 25-04-2024 - 6:36 IST
Published By : Hashtagu Telugu Desk
Sai Durga Tej విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ మేనమామ పవన్ కళ్యాణ్ తో చేసిన బ్రో కమర్షియల్ గా వర్క్ అవుట్ అయినా సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించలేదు. ఆ తర్వాత సాయి తేజ్ సంపత్ నంద్ డైరెక్షన్ లో గాంజా శంకర్ సినిమా అనౌన్స్ చేశాడు. మాస్ మసాలా సినిమాగా గాంజా శంకర్ వస్తుందని భావించగా అది కాస్త బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. సినిమా మళ్లీ మొదలవుతుందా లేదా అన్న క్లారిటీ రావట్లేదు.
ఇదిలాఉంటే సాయి తేజ్ ఆ సినిమాను పక్కన పెట్టి కొత్త దర్శకుడితో సినిమా లాక్ చేసుకున్నాడని తెలుస్తుంది. శరత్ అనే నూతన దర్శకుడితో సాయి తేజ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. హనుమాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిరంజన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలుస్తుంది. హనుమాన్ తర్వాత జై హనుమాన్ చేస్తున్న నిరంజన్ రెడ్డి ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ తో డార్లింగ్ సినిమా నిర్మిస్తున్నారు.
ఇక సాయి తేజ్ తో కొత్త దర్శకుడితో చేసే సినిమా కూడా భారీ బడ్జెట్ తో ఉంటుందని టాక్. విరూపాక్ష హిట్ తర్వాత కూడా సాయి తేజ్ నెక్స్ట్ సినిమా మొదలవ్వకపోవడం మెగా ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తుంది.
Also Read : Raviteja Anudeep : రవితేజతో అనుదీప్.. ఆ క్రేజీ టైటిల్ పెట్టేస్తున్నారా..?