Raviteja Anudeep : రవితేజతో అనుదీప్.. ఆ క్రేజీ టైటిల్ పెట్టేస్తున్నారా..?
Raviteja Anudeep మాస్ మహరాజ్ రవితేజ జాతిరత్నాలు ఫేం అనుదీప్ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. రవితేజ ప్రస్తుతం చేస్తున్న మిస్టర్ బచ్చన్
- By Ramesh Published Date - 06:31 PM, Thu - 25 April 24
![Raviteja Anudeep : రవితేజతో అనుదీప్.. ఆ క్రేజీ టైటిల్ పెట్టేస్తున్నారా..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/04/Raviteja-Anudeep-KV-movie-Crazy-Title-Donga-Police.jpg)
Raviteja Anudeep మాస్ మహరాజ్ రవితేజ జాతిరత్నాలు ఫేం అనుదీప్ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. రవితేజ ప్రస్తుతం చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రుక్మిణి వసంత్ ని తీసుకుంటున్నారని టాక్. ఇదిలాఉంటే ఈ సినిమాకు టైటిల్ గా ఒకప్పటి క్రేజీ టైటిల్ ని లాక్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఇంతకీ ఈ సినిమా టైటిల్ గా ఏది పెడుతున్నారు అంటే దొంగా పోలీస్ అని తెలుస్తుంది. ఒకప్పుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన సినిమాకు ఈ టైటిల్ పెట్టారు. యువ హీరో నిఖిల్ కూడా ఆమధ్య ఇదే టైటిల్ తో సినిమా చేశారు. ఇప్పుడు అదే టైటిల్ తో అనుదీప్ సినిమా చేస్తున్నాడు. రవితేజ ఈ సినిమాలో దొంగగా కనిపిస్తారని టాక్.
పిట్టగోడతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ కెవి జాతిరత్నాలుతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేసిన అనుదీప్ కెవి నెక్స్ట్ సినిమా రవితేజతో ఫిక్స్ చేసుకున్నాడు. మాస్ రాజా మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా అదిరిపోతుందని అంటున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుండగా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో సినిమా రిలీజ్ చేసేలా చూస్తున్నారు.
Also Read : PVR Multiplex : హమ్మయ్య.. ఇకపై పీవీఆర్ మల్టీప్లెక్స్‌లలో యాడ్స్ గోల తగ్గినట్టే..?
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Nitin : సెట్స్ మీద రెండు.. లైన్ లో మరో రెండు..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Nitin-Follows-Mahesh-Babu-and-Allu-Arjun-Multiplex-Business.jpg)
Nitin : సెట్స్ మీద రెండు.. లైన్ లో మరో రెండు..!
ఈ సినిమా తర్వాత నైంటీస్ అనే వెబ్ సీరీస్ తో టాలెంట్ చూపించిన ఆదిత్య హసన్ (Aditya Hassan) డైరెక్షన్ లో కూడా ఒక సినిమా ఓకే చేశాడట