Akhanda 2 Teaser: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అఖండ 2 తాండవం టీజర్ ఫిక్స్!
బాలకృష్ణ మాస్ ఇమేజ్, బోయపాటి హై యాక్షన్ సీక్వెన్స్‌లు, తమన్ సంగీతం ఈ సినిమాను మరో బ్లాక్‌బస్టర్‌గా మార్చనున్నాయని అభిమానులు భావిస్తున్నారు.
- By Gopichand Published Date - 11:31 AM, Sun - 8 June 25

Akhanda 2 Teaser: ‘అఖండ 2: తాండవం’ సినిమా టీజర్ (Akhanda 2 Teaser) జూన్ 9, 2025న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ వేదిక ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. జూన్ 9న సాయంత్రం 06:03 గంటలకు అఖండ 2 టీజర్ అధికారికంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రకటించారు. అదే రోజున మేకర్స్ సినిమా విడుదల తేదీని కూడా వెల్లడించే అవకాశం ఉంది.
నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రం 2021లో విడుదలైన ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. టీజర్ విడుదల బాలకృష్ణ జన్మదినం (జూన్ 10)కు ఒక రోజు ముందు జరగనుంది. ఇది అభిమానులకు పండగలా ఉంటుందని భావిస్తున్నారు.
Also Read: WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే విజేతను ఎలా ప్రకటిస్తారు?
Brace yourselves for the divine fury 🔥 #Akhanda2 – The Teaser Thaandavam from tomorrow ❤🔥#Akhanda2Teaser out on June 9th at 6.03 PM 🔱🔥#Akhanda2Thaandavam
'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_… pic.twitter.com/bD5Y7uRofb— 14 Reels Plus (@14ReelsPlus) June 8, 2025
‘అఖండ’ సినిమా శక్తివంతమైన కథ, బాలకృష్ణ డ్యూయల్ రోల్, బోయపాటి యాక్షన్ స్టైల్‌తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ‘అఖండ 2: తాండవం’ కూడా అదే స్థాయిలో యాక్షన్, డ్రామా, భక్తి యాంగిల్‌లో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే గతంలో కూడా ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించి మేకర్స్ వాయిదా వేసిన విషయం తెలిసిందే.
బాలకృష్ణ మాస్ ఇమేజ్, బోయపాటి హై యాక్షన్ సీక్వెన్స్‌లు, తమన్ సంగీతం ఈ సినిమాను మరో బ్లాక్‌బస్టర్‌గా మార్చనున్నాయని అభిమానులు భావిస్తున్నారు. టీజర్‌లో బాలకృష్ణ లుక్, డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునే అవకాశం ఉంది. సమాచారం ప్రకరాం.. ‘అఖండ 2’లో బాలకృష్ణ మరోసారి శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆధ్యాత్మికత, యాక్షన్ కలగలిపిన కథాంశం ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో మరో మైలురాయిగా నిలవనుందని అంచనాలు ఉన్నాయి. టీజర్ విడుదలతో సినిమా గురించి మరిన్ని వివరాలు, కథాంశం, తారాగణం గురించి సమాచారం బయటకు రానుంది. అభిమానులు ఈ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది.