Raviteja Eagle : ఈగల్ లేటెస్ట్ కలెక్షన్స్.. ఆ మార్క్ దాటేసిన మాస్ రాజా..!
Raviteja Eagle మాస్ మహరాజ్ రవితేజ ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజై మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా మాస్ రాజా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఈగల్ సినిమా మొదటి వారం పూర్తి చేసుకుని
- Author : Ramesh
Date : 19-02-2024 - 6:13 IST
Published By : Hashtagu Telugu Desk
Raviteja Eagle మాస్ మహరాజ్ రవితేజ ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజై మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా మాస్ రాజా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఈగల్ సినిమా మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగు పెట్టింది. సినిమా వారం రోజుల్లో 51.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించారు.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థపస్ హీరోయిన్స్ గా నటించారు. దేవజాండ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజైంది. సినిమా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడుతుంది. ఈగల్ మొదటి పార్ట్ మాత్రమే కాదు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్.
ఈగల్ 2 యుద్ధ కాండ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. సినిమా వారం రోజుల్లో 50 కోట్ల మార్క్ రీచ్ అయ్యింది. రవితేజ సినిమాల్లో 50 కోట్ల మార్క్ రీచ్ అయిన సినిమాగా ఈగల్ కూడా నిలిచింది. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు.
Also Read : NTR Devara : దేవర ఒక్కరు ఇద్దరు కాదా ముగ్గురా..?