Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు మరోసారి నోటీసులు!
మహేశ్‌బాబు ఈ వెంచర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినప్పటికీ.. అతను సంస్థ ఆర్థిక లేదా నిర్వహణ కార్యకలాపాల్లో నేరుగా భాగం కాలేదని గత ఈడీ విచారణలో తేలింది.
- By Gopichand Published Date - 07:02 AM, Mon - 7 July 25

Mahesh Babu: రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ సినీనటుడు మహేశ్‌బాబుకు (Mahesh Babu) మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్‌తో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ కేసులో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సాయి సూర్య డెవలపర్స్‌ను మొదటి ప్రతివాదిగా, దాని యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్తగా వ్యవహరించిన మహేశ్‌బాబును మూడో ప్రతివాదిగా చేర్చారు. ఫిర్యాదుదారులు మహేశ్‌బాబు ఫొటో ఉన్న బ్రోచర్‌లోని వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై డబ్బు చెల్లించినట్లు పేర్కొన్నారు. వారు సంస్థపై మోసపూరిత వాగ్దానాలు చేసినట్లు ఆరోపించారు. దీనిలో మహేశ్‌బాబు ప్రచారకర్తగా పాల్గొన్నారు.
Also Read: PM Modi: భారత్ ఉగ్రవాద బాధిత దేశం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
మహేశ్‌బాబు ఈ వెంచర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినప్పటికీ.. అతను సంస్థ ఆర్థిక లేదా నిర్వహణ కార్యకలాపాల్లో నేరుగా భాగం కాలేదని గత ఈడీ విచారణలో తేలింది. ఈడీ తన విచారణలో మహేశ్‌బాబు కేవలం ప్రచార బాధ్యతలు నిర్వహించినట్లు నిర్ధారించింది. అయితే, వినియోగదారుల కమిషన్ ఫిర్యాదులో అతని పేరు చేర్చడం వల్ల ఈ కేసు గురించి మరింత దృష్టి సారించబడింది. ఫిర్యాదుదారులు బ్రోచర్‌లో మహేశ్‌బాబు ఇమేజ్‌ను చూసి నమ్మకంతో పెట్టుబడి పెట్టినట్లు వాదిస్తున్నారు. కానీ సంస్థ తమ వాగ్దానాలను నిలబెట్టుకోలేదని ఆరోపిస్తున్నారు.
ఈ కేసు ప్రతివాదుల బాధ్యతలు, వినియోగదారుల హక్కుల గురించి ముఖ్యమైన చర్చను లేవనెత్తుతోంది. మహేశ్‌బాబు లాంటి సెలబ్రిటీలు ప్రచారకర్తలుగా వ్యవహరించినప్పుడు వారి బాధ్యత ఎంతవరకు ఉంటుందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేసు వివరాలు, నోటీసులకు మహేశ్‌బాబు స్పందన గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.