Surprise Gift For Allu Arjun: అల్లు అర్జున్ కు స్పెషల్ గిఫ్ట్ పంపిన రామ్ చరణ్ దంపతులు.. టచ్ చేశారంటూ బన్నీ ఎమోషనల్..!
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Surprise Gift For Allu Arjun)ను టాలీవుడ్ స్టార్స్ అందరూ అభినందిస్తున్నారు. వారిలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ హైలైట్ గా నిలిచింది.
- Author : Gopichand
Date : 26-08-2023 - 1:45 IST
Published By : Hashtagu Telugu Desk
Surprise Gift For Allu Arjun: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Surprise Gift For Allu Arjun)ను టాలీవుడ్ స్టార్స్ అందరూ అభినందిస్తున్నారు. వారిలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ హైలైట్ గా నిలిచింది. ఈ అవార్డులకు, విజయానికి నువ్వు అర్హుడువి అల్లు అర్జున్ బావ అని ట్వీట్ చేశాడు. దీనికి బన్నీ కూడా ‘మీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలకు ధన్యవాదాలు బావ’ అని బదులిచ్చాడు. గతంలో ఎంతో మంది దిగ్గజాలు టాలీవుడ్ లో ఉన్నపటికీ వారెవరికీ సాధ్యం కానిది బన్నీ అందుకున్నాడు. దీనితో బన్నీ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాడు. పుష్ప చిత్రానికి గాను బన్నీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.
రామ్ చరణ్ ఒక్కరోజు ఆలస్యంగా బన్నీకి విషెస్ చెప్పాడు. దానికి బన్నీ కూడా ఒక్క ముక్కలో థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో చాలా మంది అభిమానులు వీరిద్దరి మధ్య ఏం జరిగిందంటూ కామెంట్స్ కూడా చేశారు. అయితే తాజాగా రాంచరణ్, ఉపాసన దంపతులు నేషనల్ అవార్డు సాధించిన అల్లు అర్జున్ కి స్పెషల్ గిఫ్ట్ పంపారు. ఫ్లవర్ బొకేతో పాటు స్పెషల్ నోట్ ని రాంచరణ్ దంపతులు అల్లు అర్జున్ కి పంపారు. ఆ నోట్ లో రాంచరణ్, ఉపాసన ఈ విధంగా రాసుకొచ్చారు.
Also Read: Pooja Hegde: తగ్గని పూజాహెగ్డే క్రేజ్.. షాపు ఓపెనింగ్ కు ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా!
‘డియర్ బన్నీ కంగ్రాట్యులేషన్స్.. మేము నీ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాయి. ఇలాంటి ఘనతలు భవిష్యత్తులో నీవు మరిన్ని అందుకోవాలి అంటూ రాంచరణ్ స్పెషల్ నోట్ లో పేర్కొన్నాడు. బన్నీ సమాధానం ఇస్తూ .. థాంక్యూ సో మచ్. నా హృదయాన్ని టచ్ చేసింది అంటూ ఎమోషనల్ రిప్లై ఇచ్చాడు. ఈ విషయాన్నీ అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. ఈ ఘటనతో రామ్ చరణ్, బన్నీ మధ్య ఎలాంటి గ్యాప్ రాలేదని స్పష్టం అవుతుంది. దింతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు