HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan Gamechanger Locked For December 25

GameChanger: సలార్ రూట్ లోనే గేమ్ ఛేంజర్ సినిమా.. పెద్ద స్కెచ్చే వేసిన శంకర్?

  • Author : Vamsi Chowdary Korata Date : 29-02-2024 - 2:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 29 Feb 2024 12 27 Pm 2252
Mixcollage 29 Feb 2024 12 27 Pm 2252

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీబిజీగా నడుపుతున్నారు. అయితే గత మూడేళ్ళుగా చిత్రీకరణ జారుకుంటూనే ఉన్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మరో స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథని అందిస్తున్నారు. బుర్ర సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ మొదలై మూడేళ్లు అవుతున్న కూడా ఈ సినిమా నుంచి సరైన అప్డేట్ లు లేవు. దాంతో దర్శకుడు శంకర్ పై చెర్రీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయమై క్లారిటీ లేకుండా పోయింది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ మరో 30 శాతం మిగిలే ఉంది. మొన్నటివరకు షెడ్యూల్‌కి షెడ్యూల్‌కి లాంగ్ గ్యాప్ తీసుకున్న చిత్రం యూనిట్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.

రామ్ చరణ్ తో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యినట్లు సమాచారం. గేమ్ ఛేంజర్ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ కానున్నట్లు సమాచారం. లాంగ్ వీకెండ్ ఉండటంతో భారీ ఓపెనింగ్స్ పై కన్నేసి నిర్మాత దిల్ రాజు ఆ డేట్ కన్ఫమ్ చేసినట్లు చెప్తున్నారు. ప్రభాస్ సలార్ సైతం క్రిస్మస్ శెలవులను ఫెరఫెక్ట్ గా క్యాష్ చేసుకుంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా అదే రూట్ లో రాబోతోంది. వాస్తవానికి గత ఏడాది దీపావళికే ఈ సినిమా నుంచి జరగండి అనే ఫస్ట్ సింగిల్ రానున్నట్లు చెప్పారు. దీనికోసం రామ్ చరణ్ కలర్ ఫుల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ తర్వాత ఏమి జరిగిందో గానీ ఆ పాట కూడా బయటకు రాలేదు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా ఈ పాత్రకు పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతోంది. చరణ్ పాత్ర తెచ్చే మార్పులతో పొలిషియన్స్ గోలెత్తిపోతారట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • director shankar
  • GameChanger
  • ram charan
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

    • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

    • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd