NTR – Charan : ఎన్టీఆర్ కు ఎక్కడ దెబ్బ తగిలిందో అని చరణ్ కన్నీరు
NTR - Ram Charan : ఈ సినిమా తో ఎన్టీఆర్ , చరణ్ లు మాత్రమే కాదు నందమూరి , మెగా అభిమానులు కూడా చాల దగ్గరయ్యారు
- Author : Sudheer
Date : 27-12-2024 - 1:57 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్టీఆర్ , రామ్ చరణ్ (NTR-Ram CHaran) కలిసి రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ (RRR)మూవీ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. ఈ సినిమా తో ఎన్టీఆర్ , చరణ్ లు మాత్రమే కాదు నందమూరి , మెగా అభిమానులు కూడా చాల దగ్గరయ్యారు. ఈ మూవీ షూటింగ్ తాలూకా అనేక వీడియోస్ ఆకట్టుకోగా..తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఆర్ఆర్ఆర్ బిహైండ్ సీన్స్ డాక్యుమెంటరీ విడుదలైంది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి తమ అనుభవాలను పంచుకున్నారు.
రాజమౌళి ఈ సినిమా కోసం ఎన్ని రిహార్సల్స్ చేశారో, ప్రతి సీన్‌ను ఎంత కష్టపడి షూట్ చేశారో వివరించాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకరిపై ఒకరు ఎంత అభిమానం , ప్రేమగా ఉన్నారో వీడియో లో చూపించారు. ముఖ్యంగా కొమురం భీముడో పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య కొరడా సీన్స్ ఉంటాయి. రామ్ చరణ్ ఈ సీన్లు చేయడానికి చాలానే ఇబ్బంది పడినట్టుగా కనిపిస్తోంది. తారక్‌కి ఎక్కడ దెబ్బ తగిలిందో అని రామ్ చరణ్ తెగ బాధపడినట్టుగా కనిపిస్తోంది. ఈ విషయం గురించి సైడ్ ఆర్టిస్ట్‌గా నటించిన మహిళ గతంలోనే చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ మరింత డెలికేటెడ్‌గా, సున్నితంగా ఉన్నాడేంట్రా బాబు అని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ దేవర తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
Such a Lovely Bond 🥺🫶🏼@AlwaysRamCharan ❤️🔥 @tarak9999pic.twitter.com/APl6VLU0eK
— Ujjwal Reddy (@HumanTsunaME) December 27, 2024
Read Also : Rohit Sharma: ఓపెనర్ గానూ ప్లాప్.. రీటైర్మెంట్ ఇవ్వాల్సిందే అంటున్న ఫ్యాన్స్