ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!
ఇక మెడికల్ కాలేజీల ఖర్చు విషయంలోనూ జగన్ రెడ్డి శుద్ధ అబద్దాలు చెప్పారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ స్టాఫ్ ఖర్చు కోసం ప్రభుత్వం ఏడాదికి వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని.. ఇది ప్రైవేటు సంస్థలకు మేలు చేయడమే అంటున్నారు జగన్‌రెడ్డి.
- Author : Gopichand
Date : 19-12-2025 - 3:31 IST
Published By : Hashtagu Telugu Desk
- ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు
- అసత్య ఆరోపణలు చేస్తున్న వైసీపీ
Jagan Allegations PM Modi: ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేయడం.. ప్రత్యర్ధుల మీద నిందలు మోపడంలో వైసీపీ నేతలు ఆరిపోయారు. ఇక ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. తన తప్పిదాన్ని కప్పి పుచ్చడానికి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. రుషికొండ మీద ప్యాలెస్ నిర్మాణం కోసం 500 కోట్లు వృధా చేశారని.. ఆ డబ్బుతో రెండు మెడికల్ కాలేజీలు కట్టొచ్చన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జగన్‌రెడ్డి.. బోడిగుండికీ.. మోకాలికీ.. ముడిపెట్టినట్టు రుషికొండ ప్యాలెస్‌కీ.. యోగాంధ్ర కార్యక్రమానికి పోలిక పెట్టి.. అసంబద్ద ఆరోపణలు చేశారు.
రుషికొండ ప్యాలెస్ విశాఖలో మాన్యమెంట్‌లా మిగిలిపోయిందని.. యోగాంధ్ర కార్యక్రమం కోసం 330 కోట్లు వృధా చేశారని ఆరోపించారు జగన్‌రెడ్డి. అంతేగాక.. యోగాంధ్రలో అవినీతి జరిగిందని విమర్శలు చేశారు. అయితే ఈ రెండు ఆరోపణలు ఫేక్ అని ఆధారాలతో సహా రుజువు చేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. వాస్తవానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. ప్రతి యేటా కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈసారి ఆ ప్రోగ్రామ్‌ని ఏపీకి తీసుకొచ్చారు. యోగాంధ్ర మొత్తం ఖర్చు 62 కోట్లయితే.. 330 కోట్లు అని జగన్‌రెడ్డి చాలా పెద్ద అబద్దమే చెప్పారు. ఈ 62 కోట్లలోనూ 90 శాతం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ నుంచి వచ్చాయి. ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర కోసం పది శాతం నిధులను మాత్రమే ఖర్చు చేసింది.
Also Read: వెల్లుల్లి నీరు క్యాన్సర్‌ను నివారిస్తుందా?!
యోగాని ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలో అవినీతి జరిగిందని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్‌రెడ్డి. దీనిపై ఏపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మోడీపై విమర్శలు చేసే స్థాయి, అర్హత.. జగన్‌కు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ జగన్‌కి.. ఏ కార్యక్రమానికి ఎక్కడి నుంచి నిధులు వస్తాయనే విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. రుషికొండ మీద ప్యాలెస్ కోసం 500 కోట్లు వేస్ట్ చేసిన అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే.. యోగాంధ్ర కార్యక్రమంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు ఏపీ కమలనాథులు.
ఇక మెడికల్ కాలేజీల ఖర్చు విషయంలోనూ జగన్ రెడ్డి శుద్ధ అబద్దాలు చెప్పారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ స్టాఫ్ ఖర్చు కోసం ప్రభుత్వం ఏడాదికి వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని.. ఇది ప్రైవేటు సంస్థలకు మేలు చేయడమే అంటున్నారు జగన్‌రెడ్డి. అయితే.. పీపీపీ విధానంలో ప్రభుత్వానికీ మెడికల్ కాలేజీల్లో వాటా ఉంటుంది. సర్కారు వాటా కింద సిబ్బంది జీతభత్యాలను చెల్లిస్తుందని వివరిస్తున్నారు. ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు.. ప్రైవేటు యాజమాన్యంలో నడిచినా.. వాటిలో పని చేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ప్రభుత్వమే నియమించి.. వారికి జీతాలు ఇస్తుంది. పీపీపీ విధానంలో నిర్మించే మెడికల్ కాలేజీల విషయంలోనూ.. ఎయిడెడ్ సంస్థలకు పోలిన విధానాన్నే అనుసరిస్తామని చెబుతున్నారు. అయితే మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వానికీ వాటా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.