Ram Charan: అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ.. వీడియో వైరల్..!
SS రాజమౌళి సినిమా 'RRR' వలన రామ్ చరణ్ (Ram Charan) నిరంతరం వార్తలలో ఉంటున్నాడు. ఆస్కార్‌ను గెలుచుకున్న తర్వాత అభిమానులు అతనికి, చిత్ర బృందానికి నిరంతరం అభినందనలు తెలుపుతున్నారు.
- By Gopichand Published Date - 06:42 AM, Sat - 18 March 23

SS రాజమౌళి సినిమా ‘RRR’ వలన రామ్ చరణ్ (Ram Charan) నిరంతరం వార్తలలో ఉంటున్నాడు. ఆస్కార్‌ను గెలుచుకున్న తర్వాత అభిమానులు అతనికి, చిత్ర బృందానికి నిరంతరం అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఢిల్లీలో రామ్ చరణ్‌ను కలిశారు. ఆస్కార్ వచ్చాక తొలిసారిగా ఢిల్లీకి వచ్చిన చరణ్ తన తండ్రి చిరంజీవితో కలిసి అమిత్ షాను కలిశారు. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై హోంమంత్రి అభినందించారు.
రామ్ చరణ్, అమిత్ షాల భేటీ అనంతరం ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో అమిత్ షా, రామ్ చరణ్ చేతుల్లో పూల బొకే పట్టుకుని కనిపిస్తున్నారు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పక్కన నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోటోపై అభిమానులు కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు.
Also Read: RRR: నాటు నాటు పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ.. అబ్బో మాములుగా చేయలేదుగా?
దీంతో పాటు ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది.హోంమంత్రికి రామ్ చరణ్ పుష్పగుచ్ఛం అందించి అభివాదం చేస్తున్న దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తోంది. అనంతరం ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ఆస్కార్ అవార్డును గెలుచుకున్న రామ్ చరణ్‌కు అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ వీడియోపై అభిమానులు విపరీతంగా ప్రేమ కురిపిస్తున్నారు. అదే సమయంలో చిరంజీవి ముఖంలో గర్వం కనిపిస్తోందని కొందరు అభిమానులు అంటున్నారు. తన తనయుడు రామ్‌చరణ్ సాధించిన విజయాల పట్ల ఆయన చాలా సంతోషంగా ఉన్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
#WATCH | Union Home Minister Amit Shah met RRR fame actor Ram Charan and his father Chiranjeevi in Delhi. Home Minister congratulated them after 'Naatu Naatu' won Oscars pic.twitter.com/Tumzecmzev
— ANI (@ANI) March 17, 2023
ఇంతకు ముందు కూడా ‘నాటు నాటు’ ఆస్కార్‌ను గెలుచుకున్నందుకు హోంమంత్రి ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారతీయ సినిమాకు ఇది చారిత్రాత్మకమైన రోజు అని అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ పాట భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల పెదవులపై ఉంది. ‘RRR’ టీమ్‌కి అభినందనలు అని తెలిపిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా.. ఇండియా టుడే కాన్ క్లేవ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో ప్రధాని మోడీ, సచిన్ తో ఆయన వేదికను పంచుకున్నారు.

Related News

Senior Actor Passes Away: టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటుడు మృతి
తెలుగు చిత్ర పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ లో ప్రముఖ సీనియర్ నటుడు (Senior Actor Passes Away) కన్నుమూశారు. ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, నిర్మాత వీరమాచినేని ప్రమోద్ కుమార్ (87) (Veeramachaneni Pramod Kumar) కన్నుమూశారు.