Rakul Preet Singh : రకుల్ ప్లానింగ్ అదిరింది.. జిమ్ తర్వాత ఇప్పుడు మరో బిజినెస్ స్టార్ట్..!
Rakul Preet Singh సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్యనే తన ప్రియుడిని పెళ్లాడిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాణించిన రకుల్ ఈమధ్య కెరీర్ పూర్తిగా ఫాం కోల్పోయింది.
- By Ramesh Published Date - 03:36 PM, Fri - 12 April 24
Rakul Preet Singh సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్యనే తన ప్రియుడిని పెళ్లాడిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాణించిన రకుల్ ఈమధ్య కెరీర్ పూర్తిగా ఫాం కోల్పోయింది. జాకీ భగ్నానిని పెళ్లి చేసుకున్నాక సినిమాలు కొనసాగించే ఆలోచన ఉన్నా బిజినెస్ లో అమ్మడు స్ట్రాంగ్ అవ్వాలని చూస్తుంది.
ఈ క్రమంలో హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ ను పెట్టబోతుంది రకుల్ ప్రీత్ సింగ్. అల్రెడీ రకుల్ ప్రీత్ సింగ్ F45 అనే ఫిట్ నెస్ సెంటర్ ను రన్ చేస్తుంది. హైదరాబాద్, వైజాగ్ లలో ఈ జిమ్ లు ఉన్నాయి. ఇక ఇప్పుడు రకుల్ మరో బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. హైదరాబాద్ లో ఆరంభం అనే రెస్టారెంట్ ను పెట్టబోతుంది రకుల్.
హీరోయిన్ గా ఛాన్సులు రాకపోయినా బిజినెస్ చేస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలని చూస్తుంది రకుల్. తెలుగులో అవకాశాలు లేవు కానీ రకుల్ ట్రై చేస్తే బాలీవుడ్ లో ఛాన్సులు వచ్చే వీలుంది. అక్కడ రకుల్ వెరైటీ సినిమాలతో అలరిస్తూ వస్తుంది. అయితే తనకు స్టార్ డం వచ్చిన హైదరాబాద్ లో తన బిజినెస్ ను డెవలప్ చేయాలని చూస్తుంది అమ్మడు. తెలుగు వాళ్లు ఫుడ్ లవర్స్ అని తెలుసు కాబట్టే ఇక్కడ అమ్మడు రెస్టారెంట్ పెట్టి లాభాలు పొందాలని చూస్తుంది.
Also Read : Rajamouli- David Warner: డేవిడ్ వార్నర్‌తో జత కట్టిన రాజమౌళి.. దేని కోసం అంటే..?