Rajamouli- David Warner: డేవిడ్ వార్నర్‌తో జత కట్టిన రాజమౌళి.. దేని కోసం అంటే..?
వార్నర్‌ను దర్శకుడు రాజమౌళి (Rajamouli- David Warner)ని ఎందుకు కలిశారో అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్టోరీ మొత్తం చూడండి.
- Author : Gopichand
Date : 12-04-2024 - 3:02 IST
Published By : Hashtagu Telugu Desk
Rajamouli- David Warner: డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా క్రికెటర్ అని అందరికీ తెలిసిందే. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. టాలీవుడ్ దర్శకుడు.. ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చూసేలా చేసిన గొప్ప డైరెక్టర్. అయితే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా మధ్యమధ్యలో యాడ్స్‌లో కూడా కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ వార్నర్‌ను దర్శకుడు రాజమౌళి (Rajamouli- David Warner)ని ఎందుకు కలిశారో అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్టోరీ మొత్తం చూడండి.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్- దర్శకధీరుడు రాజమౌళి ఓ ప్రముఖ సంస్థ యాడ్ కోసం చేతులు కలిపారు. ఓ ప్రముఖ సంస్థ తమ ప్రొడక్ట్ ఇన్ స్టాల్స్‌ను, డౌన్‌లోడ్స్‌ను పెంచుకోవడం కోసం ఈ ఇద్దరి ప్రముఖులతో చేతులు కలిపింది ఓ ప్రముఖ సంస్థ. డేవిడ్ వార్నర్, రాజమౌళితో ఓ యాడ్ చేసింది. ఈ యాడ్‌ని డేవిడ్ వార్నర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. ఈ యాడ్‌లో ఏముందంటే.. డేవిడ్ గారు మీ మ్యాచ్ కోసం నేను టికెట్లను తీసుకోవాలనుకుంటున్నాను. ఈ మ్యాచ్ టికెట్లపై ఏమైనా డిస్కౌంట్ ఉందా..? అని రాజమౌళి డేవిడ్ వార్నర్‌ను ఫోన్ చేసి అడుగుతారు.
Also Read: Nara Lokesh Phone Tapping: ఏపీలో ట్యాపింగ్ ప్రకంపనలు.. నారా లోకేశ్ ఫోన్ ట్యాపింగ్..!
అప్పుడు డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ ఆ ప్రముఖ సంస్థ యాప్ ఫోన్‌లో ఉంటే డిస్కౌంట్ తో పాటు క్యాష్ బ్యాక్ కూడా వస్తుందని చెప్తాడు. అయితే అప్పుడు జక్కన్న నార్మల్ యూపీఐలో ఈ ఆఫర్లు లేవా అడుగుతాడు. దానికి వార్నర్ మీరు తగ్గింపు కోసం నాకు సహాయం చేయాలి అని అంటాడు. దాని తర్వాత రాజమౌళి డేవిడ్ వార్నర్‌ను పెట్టి సినిమా తీస్తున్న వీడియో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
We’re now on WhatsApp : Click to Join
ఇందులో రాజమౌళి.. వార్నర్‌తో షూట్ చేస్తుంటే డేవిడ్ ఇచ్చే హావాభావాలు, డ్యాన్స్ మూవ్స్, లాంగ్వేజ్ అంతా వేరే విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మూవీ పేరు ఆర్ఆర్ఆర్ఆర్ అని పెడదామా అని అంటాడు. ఈ మూవీని ఆస్కార్స్‌కు పంపుదామా అని కూడా అడుగుతాడు వార్నర్. అయితే చివర్లో ఇదంతా ఊహించుకున్న జక్కన్న వద్దులే నేను ఆ యాప్‌ను అప్డేట్ చేసుకుంటా అని ఫోన్ చేస్తాడు. ఇందులో చాలా ఫన్ ఉంటుంది. ఈ వీడియో కింద ఉంది చూడండి.
Warner bros 😉 @ssrajamouli pic.twitter.com/PfE0Sn9Tb0
— David Warner (@davidwarner31) April 12, 2024