Rakul Preet ‘Gay’ Comments: గే అయితే చెంప పగులకొడ్తా.. స్వలింగ సంపర్కులపై రకుల్ షాకింగ్ కామెంట్స్
పాన్-ఇండియన్ నటి రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి ట్రోల్స్‌కు గురి అయింది. ఆమె మిస్ ఇండియా అయిన రోజులను గుర్తుకు చేసుకుంటూ ఓ
- By Balu J Published Date - 11:32 AM, Wed - 26 October 22
పాన్-ఇండియన్ నటి రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి ట్రోల్స్‌కు గురి అయింది. ఆమె మిస్ ఇండియా అయిన రోజులను గుర్తుకు చేసుకుంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అయితే సినీ కెరీర్ గురించే కాకుండా, పర్సనల్ లైఫ్ గురించి కూడా అనేక రూమర్స్ వస్తన్నాయి. ప్రస్తుతం ఆమె జాకీ భగ్నానితో డేటింగ్ చేస్తోంది. అయితే, ఓ పాత వీడియో రకుల్ క్యారెక్టర్ డైలమాలో పడేలా చేసింది.
2011లో మిస్ ఇండియాలో పాల్గొన్నప్పటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్ నెట్ లో ప్రత్యక్షమైంది. రకుల్ సోనూసూద్‌తో, స్టార్-స్టడెడ్ ప్యానలిస్ట్ ఫర్దీన్తో స్టేజీని పంచుకుంది. ‘‘అయితే తన కొడుకు స్వలింగ సంపర్కుడని తెలిస్తే మీ స్పందన ఏమిటని’’ ఖాన్ ప్రశ్నించడం వీడియో చూడొచ్చు. దీనికి రకుల్ ప్రీత్ సింగ్ ఆన్సర్ చేస్తూ.. “సరే, నా కొడుకు స్వలింగ సంపర్కుడని తెలిస్తే నేను షాక్ అవుతాను. అంతేకాదు అతనిని చెంప పగులకొడ్తాను. కానీ తర్వాత.. సొంత లైంగికతను ఎంచుకోవడం అనేది ఒకరి సొంత నిర్ణయంగా భావిస్తా. అలాంటి కొడుకుతో ముందుకు వెళ్లాలనుకుంటే నాకు ఎలాంటి సమస్య లేదు. నాకు సంబంధించినంతవరకు, నేను సూటిగా ఉండటానికి ఇష్టపడతాను’’ అంటూ రియాక్ట్ అయ్యింది రకుల్.
ప్రస్తుతం రకుల్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్స్ ఆమె తీరుపై కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆమెను కియారా అద్వానీలా ఎందుకు కనిపిస్తోందో చెప్పాలని రియాక్ట్ అయ్యారు. “బహుశా ఇది ఆమె ద్విపాత్రాభినయం అని చెప్పే విధానం కావచ్చు. సాధారణ జీవితాలలో పాటు సెలబ్రిటీలు సైతం (అమ్మాయిలలో) స్వలింగసంపర్కం, జాత్యహంకారం పిచ్చిగా ఉంది” అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఏదైమైనా రకుల్ ప్రీత్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
Related News
AP Politics: చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే
AP Politics: గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 22వరోజుకు చేరుకుంది. ప్రజలతో కలిసి ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరించారు. రాబోయే ఐదేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజానీకానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ