Radhe Shyam: రాధే శ్యామ్ ట్విట్టర్ రివ్యూ.. ఏదో తేడా కొడుతుందే..?
- By HashtagU Desk Published Date - 09:58 AM, Fri - 11 March 22

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం కోసం, ప్రభాస్ అభిమానులే కాకుండా యావత్ సినీ అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూశారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. విధికి ప్రేమకు మధ్య జరిగే యుధ్ధం కాన్సెప్ట్‌తో, పిరియాడిక్ లవ్ డ్రామాగా ఇటలీలో భారీ బడ్జెట్‌తో రాధే శ్యామ్ మూవీ తెరకెక్కింది.
ప్రభాస్ హీరో కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో రాధే శ్యామ్ భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7010 స్క్రీన్స్‌లో ఈ చిత్రం రిలీజైంది. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు, టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన రావడంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఈ శుక్రువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధే శ్యామ్, ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ప్రీమియర్ షోలు కంప్లీట్ అవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు.
రాధే శ్యామ్ మూవీ పై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ టాక్ వస్తుంది. బ్యూటీఫుల్ లవ్ స్టోరీని డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ అద్భుతంగా తెరకెక్కించారని కొందరు చెబుతున్నారు. విజువల్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయని, ప్రభాస్, పూాజాల కెమిస్ట్రీ వేరే లెవల్‌లో ఉందని, ప్రభాస్ లుక్ అండ్ ఫెర్ఫామెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయని ట్వీట్ చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకర్ స్వరపర్చిన పాటలు విజువలైజ్‌గా బాగున్నాయని, ఇక తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఔట్ స్టాండింగ్‌గా ఉందని అంటున్నారు.
ఫస్ట్ హాప్ ఎక్కడా బోర్ కొట్టకుండా కూల్‌గా సాగుతోందని, ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్‌బ్లోయింగా ఉందని, ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం, సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళిందని, సెకండ్ హాప్ కూడా ఎక్స్‌లెంట్‌గా ఉందని, ప్రభాస్ కెరీర్‌లోనే రాధే శ్యామ్ మరో బ్లాక్ బస్టర్ అని కొందరు ప్రేక్షలు చెబుతున్నారు. ఇక మరొకొందరు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారు. ఈ సినిమా బాగా స్లో గా ఉందని, ప్రభాస్ అకౌంట్‌లో మరో ఫ్లాప్ అని ట్వీట్లు చేస్తున్నారు. దీంతో రాధే శ్యామ్ పై సోషల్ మీడియాలో మిక్స్‌డ్ టాక్ నడుస్తున్న క్రమంలో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
1st half ok for visuals
2nd half li8
Climax mehhh but good vfx
— Nav🌶️ (@maamaekpeglaa) March 11, 2022
https://twitter.com/PKasindala/status/1502016170207195136?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1502016170207195136%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.hmtvlive.com%2Fmoviereviews%2Fradhe-shyam-movie-twitter-genuine-review-telugu-78642
Hit Bomma 💥🔥🔥🤙🏻🤙🏻🤙🏻
K. Ramp anthe #RadheShyam pic.twitter.com/Fh9YKI2SE5— 𝕻𝖆𝖗𝖉𝖍𝖚 𝕯𝕳𝕱𝕸 (@urstruly_srii) March 11, 2022
https://twitter.com/above_armour/status/1502042305360011274?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1502042305360011274%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.filmyfocus.com%2Fradhe-shyam-movie-twitter-review%2F
https://twitter.com/above_armour/status/1502043011261284357?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1502043011261284357%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.filmyfocus.com%2Fradhe-shyam-movie-twitter-review%2F
#RadheShyam reviews are 🥲
Ramp Radha Cameron enti sir idhi !
ST in 2hrs 🤕
— Cinema&Charan❁ (@urscherry3) March 11, 2022
Showtime #RadheShyam
— 🤘 (@Robinh00d7) March 10, 2022