Pushpa-2 Team Meet Megastar: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన పుష్ప-2 టీమ్.. కారణమిదేనా?
తాజాగా అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చింది పుష్ప-2. ఈ సినిమాకు మెగా హీరోలు ఎవరూ విషెష్ చెప్పలేదు. కేవలం సాయి ధరమ్ తేజ్ మాత్రమే సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ తెలిపాడు.
- By Gopichand Published Date - 09:57 PM, Thu - 5 December 24

Pushpa-2 Team Meet Megastar: మెగాస్టార్ చిరంజీవి (Pushpa-2 Team Meet Megastar) టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏడు పదుల వయసు దగ్గర పడుతున్న యంగ్ హీరోలతో పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన నీడలోనే మెగా, అల్లు హీరోలు పుట్టుకొచ్చారు. అయితే ఇటీవల కాలంలో చేసుకున్న కొన్ని కారణాలు మెగా- అల్లుకు మధ్య దూరం పెంచిందనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రూమర్లకు చెక్ పెట్టేందుకు ఇంతవరకు ఇటు మెగా హీరోలకు కానీ.. అటు అల్లు హీరోలకు కానీ అవకాశం రాలేదు.
తాజాగా అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చింది పుష్ప-2. ఈ సినిమాకు మెగా హీరోలు ఎవరూ విషెష్ చెప్పలేదు. కేవలం సాయి ధరమ్ తేజ్ మాత్రమే సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ తెలిపాడు. మెగా బ్రదర్ నాగబాబు కూడా అల్లు అర్జున్, పుష్ప-2 మూవీ పేరు ఎత్తకుండా సినిమాను సినిమా లాగే చూడండి అని మెగా అభిమానులకు పిలుపునిస్తూ ట్వీట్ వదిలారు.
Also Read: Telangana Higher Education: టీ-శాట్‌తో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక ఒప్పందం!
చిరును కలిసిన ‘పుష్ప 2’ టీమ్
మెగాస్టార్ చిరంజీవిని ‘పుష్ప 2’ టీమ్ కలిసింది. నిర్మాతలు రవిశంకర్, నవీన్ యేర్నేని, సీఈఓ చెర్రీ, దర్శకుడు సుకుమార్.. చిరును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. pic.twitter.com/Z5J8TBhf2Y
— ChotaNews (@ChotaNewsTelugu) December 5, 2024
అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ఒక సన్నివేశం కూడా మెగా, అల్లు అభిమానులకు కనిపించలేదు. తాజాగా పుష్ప-2 సినిమా విడుదల సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పుష్ప-2 చిత్రయూనిట్ వెళ్లింది. మెగాస్టార్ ఇంటికి వెళ్లినవారిలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, నవీన్ యేర్నేని, సీఈఓ చెర్రీ, దర్శకుడు సుకుమార్ ఉన్నారు. వారు పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా మెగాస్టార్‌ను కలవటం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే వారు చిరంజీవిని తమ మూవీ పుష్ప-2ని చూడమని కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చిరంజీవి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు. మెగాస్టార్ కూడా తనకు సమయం దొరికిన వెంటనే పుష్ప-2 మూవీ చూస్తానని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే పుష్ప-2 మూవీ యూనిట్‌ను మెగాస్టార్ కలవటంతో వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, సోషల్ మీడియాలో కావాలనే ఫేక్ వార్తలు వైరల్ చేస్తున్నారని ఇరు కుటుంబాల అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.