HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Key Agreement Of Telangana State Council Of Higher Education With T Sat

Telangana Higher Education: టీ-శాట్‌తో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క ఒప్పందం!

టీ-శాట్‌ (సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్‌వర్క్) అనేది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ సమాచార శాఖ ద్వారా నడుపబడుతున్న టీవీ ఛానల్.

  • Author : Gopichand Date : 05-12-2024 - 9:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Higher Education
Telangana Higher Education

Telangana Higher Education: తెలంగాణ ఉన్నత విద్యా మండలి (Telangana Higher Education) నందు గురువారం T-SATతో ఉన్నత విద్యలో భావితరాల వారికి విలువైన విద్యను అందించేందుకు గాను తెలంగాణ ఉన్నత విద్యా మండలి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందం ముఖ్య‌ ఉద్దేశ్యం అధ్యాపకులకు, విద్యార్థులకు అధునాతనమైన సబ్జెక్టులపై నైపుణ్యం పెంచే వివిధ ట్రైనింగ్ ప్రొగ్రామ్స్, చర్చలు, ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్ధతుల్లో బోధన చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. వి. బాలకిష్టా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విద్య ప్రమాణాలను మెరుగుపరచేందుకు గాను ఉన్నత విద్యా మండలి.. T-SAT కలసి విద్యార్థుల కొరకు సర్టిఫికేట్ కోర్సు, డిప్లోమా కోర్సు, స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ ను నిర్వహించేందుకు గాను తెలంగాణ ఉన్నత విద్యా మండలి T-SAT వారితో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందని అన్నారు. అలాగే T-SAT ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంటింటికి ఉన్నత విద్యను అందించాల్సిన అవసరం ఉందని, నాణ్యత ప్రమాణాలతో కూడిన నిపుణులను ఎంచుకోవాలని, అన్ని విశ్వవిద్యాలయాలు కూడా T-SATను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్-చైర్మెన్ ప్రొ. ఇటికాల పురుషోత్తం, వైస్-చైర్మెన్ SK మహ్మమూద్, సెక్రటరీ ప్రొ. శ్రీరాం వెంకటేష్ పాల్గొన్నారు.

Also Read: Case Against Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్‌.. కేసు నమోదు!

టీ- శాట్ అంటే ఏమిటి?

టీ-శాట్‌ (సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్‌వర్క్) అనేది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ సమాచార శాఖ ద్వారా నడుపబడుతున్న టీవీ ఛానల్. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి సాంకేతికత పరిజ్ఞానంతో, నాణ్యమైన ప్రమాణాలతో వారికవసరమైన సమాచారాన్ని లక్ష్యంతో ఈ టీ-శాట్‌ను ప్రారంభించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. మన టీవీ స్థానంలో టీ శాట్‌ పేరుతో కొత్త నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌లో ఐటీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 2017 జూలై 26న ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. విద్య, నిపుణ పేరుతో రెండు ఛానళ్ళను, టీ-శాట్‌ లోగోను, యాప్‌ను ఆవిష్కరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • education
  • Education News
  • hyderabad
  • T-SAT
  • telangana
  • Telangana Higher Education
  • Telangana State Council of Higher Education

Related News

Huge Demand for Goats and Chickens at Medaram

మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు

Medaram Jatara  మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం)తోపాటు కోళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇవ్వడం మేడారం జాతరలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయతీ. దీంతో, మేడారంలో కోళ్లు, మేలు, గొర్రెల అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి Huge Demand for Goats and Chickens at Medaram. లక్షల సంఖ్యలో కోళ్లు, వేల సంఖ్యలో మేకలు, గొర్రెల విక్రయాలు జరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసు

  • New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

    నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

  • Kushals Fashion Jewelry expands significantly in Hyderabad

    ఒకే రోజులో నాలుగు కొత్త స్టోర్‌లు: కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ ఘన విస్తరణ

  • Medaram Sammakka Saralamma Maha jatara begins

    వనదేవతల కొలువుకు వేళాయె..మేడారంలో ఈ 4 రోజులు ఏ రోజు ఏం జరుగుతుంది?

  • Global Capability Center launched in Hyderabad

    హైదరాబాద్‌లో గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ప్రారంభం

Latest News

  • భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా?

  • పవిత్రస్థలం..అపవిత్రం చేసారు కదరా ! మీ ఫోటో షూట్ తగిలేయ్య !!

  • టొయోటా కారుకు షాకింగ్ సేఫ్టీ రేటింగ్‌.. భ‌ద్ర‌త అంతంత మాత్ర‌మే!

  • 40 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 4 సార్లు మాత్రమే ఆలౌట్‌!

  • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

Trending News

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

    • ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd