‘Pushpa-2’ Midnight Shows : ‘పుష్ప-2’ మిడ్ నైట్ షోలు రద్దు..షాక్ లో ఫ్యాన్స్
'Pushpa-2' Midnight Shows : బెంగళూరు జిల్లా కలెక్టర్ మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షో('Pushpa-2' midnight shows cancelled)లపై ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల వరకు సినిమాలు ప్రదర్శించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు
- By Sudheer Published Date - 07:21 PM, Wed - 4 December 24

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2: ది రూల్ (Pushpa 2 )సినిమా విడుదలకు ముందు కర్ణాటకలో ఊహించని షాక్ తగిలింది. బెంగళూరు జిల్లా కలెక్టర్ మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షో(‘Pushpa-2’ midnight shows cancelled)లపై ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల వరకు సినిమాలు ప్రదర్శించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే షోలు ఏర్పాటు చేసిన థియేటర్లు సందిగ్ధంలో పడ్డాయి.
కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల ఫిర్యాదు(Complaint by Kannada film producers) మేరకు ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. మిడ్ నైట్ షోలు కన్నడ చిత్రాలకు నష్టం కలిగించే అవకాశం ఉందని నిర్మాతలు ఆరోపించారు. ఇతర భాషా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చి స్థానిక సినిమాల ఉనికిని దెబ్బతీసే పరిస్థితి ఏర్పడుతోందని వారు పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదేశాలతో పుష్ప-2 అభిమానులకు నిరాశ ఎదురైంది. సినిమా యూనిట్ ఇప్పటికే పలు థియేటర్లలో మిడ్ నైట్ షోలు ప్లాన్ చేసింది. అయితే తాజా ఆంక్షల కారణంగా ఈ షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బుకింగ్ లలో ఇబ్బందులు ఎదురవుతాయని థియేటర్ యాజమాన్యాలు అంటున్నాయి.
కర్ణాటక(Karnataka)లో రాత్రి 10 గంటల తరువాత నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి షోలను ప్రదర్శించకూడదని చట్టం ఉంది. ఈ నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు ఆంక్షలను పాటించాల్సి వస్తోంది. ప్రస్తుత నిర్ణయం కన్నడ చిత్ర పరిశ్రమకు మద్దతుగా తీసుకున్న చర్యగా భావిస్తున్నారు. పుష్ప-2 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మరికాసేపట్లో షోస్ మొదలుకాబోతున్నాయి. దీంతో థియేటర్స్ వద్ద అభిమానుల సందడి మొదలైంది. సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని , రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి సినిమా టాక్ ఎలా ఉంటుందో..? రివ్యూస్ వస్తే కానీ సినిమా పరిస్థితి ఏంటి అనేది తెలియదు.
Read Also : New Honda Amaze: రూ. 8 లక్షలకు కొత్త హోండా అమేజ్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు వచ్చిన ఫీచర్లు ఇవే!