Pushpa 2 : పుష్ప 2 ఈవెంట్ లో బోజ్ పురి స్టార్ డాన్స్..!
Pushpa 2 ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా బోజ్ పూరి స్టార్ హీరోయిన్ అక్షరా సింగ్ తో స్పెషల్ పర్ఫార్మెన్స్ ని ఏర్పాటు చేస్తున్నారట. పుష్ప 1 లోని సాంగ్ మెడ్లీ తో పాటుగా పుష్ప 2
- By Ramesh Published Date - 11:04 PM, Sat - 16 November 24

అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ కాంబోలో భారీ అంచనాలతో రాబోతున్న పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు పాట్నా రెడీ అవుతుంది. పాట్నాలోని గాంధి మైదాన్ లో సాయంత్రం 5 గంటల నుంచి పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ మొదలు కాబోతుంది. ఈ వేడుక పాస్ కోసం ఇప్పటికే ఆడియన్స్ అంతా భారీ సంఖ్యలో వచ్చారు. ఐతే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని మరింత క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
(Sukumar) ఈ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా బోజ్ పూరి స్టార్ హీరోయిన్ అక్షరా సింగ్ తో స్పెషల్ పర్ఫార్మెన్స్ ని ఏర్పాటు చేస్తున్నారట. పుష్ప 1 లోని సాంగ్ మెడ్లీ తో పాటుగా పుష్ప 2 లోని సాంగ్స్ కి ఆమె డ్యాన్స్ చేస్తుందని తెలుస్తుంది. పుష్ప 2 ట్రైలెర్ రిలీజ్ ఈవెంట్ కి ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.
పుష్ప 2 పాన్ ఇండియా రేంజ్..
అల్లు అర్జున్ ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సుకుమార్ కూడా సినిమాపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 5న పుష్ప 2 పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. సినిమాపై నార్త్ లో భారీ క్రేజ్ ఉండగా అనుకున్న విధంగా సినిమా ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ రికార్డులను కొల్లగొట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
ఆదివారం జరగబోతున్న (Pushpa 2) ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసమే భారీ సంఖ్యలో ఫ్యాన్స్ హంగామా కనిపిస్తుంది. వీళ్లలో నార్త్ ఆడియన్స్ ఎక్కువ ఉండటం విశేషం.
Also Read : Pooja Hegde : ఆ హీరోని నమ్ముకున్న పూజా హెగ్దే..!