Pooja Hegde : ఆ హీరోని నమ్ముకున్న పూజా హెగ్దే..!
Pooja Hegde తెలుగులో స్టార్ డం తెచ్చుకున్న అమ్మడు మళ్లీ ఇక్కడ రాణించాలని ఆశ పడుతుంది. తీరా చూస్తే ఇక్కడ ఒక్క అవకాశం కూడా లేదు. ఐతే అక్కినేని హీరో నాగ చైతన్య (
- By Ramesh Published Date - 10:47 PM, Sat - 16 November 24

బుట్ట బొమ్మ పూజా హెగ్దేని టాలీవుడ్ ఎందుకో దూరం పెడుతుంది. రాధే శ్యాం తర్వాత తెలుగు నుంచి అమ్మడికి ఒక్క ఆఫర్ కూడా రాలేదు. సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సినిమా నుంచి కొన్ని కారణాల వల్ల తప్పుకున్న పూజా హెగ్దే మళ్లీ మరో ఛాన్స్ అందుఓలేదు. ఐతే తెలుగుకి గ్యాప్ ఇచ్చి తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తుంది పూజా హెగ్దే.
ఐతే తెలుగులో స్టార్ డం తెచ్చుకున్న అమ్మడు మళ్లీ ఇక్కడ రాణించాలని ఆశ పడుతుంది. తీరా చూస్తే ఇక్కడ ఒక్క అవకాశం కూడా లేదు. ఐతే అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) సినిమాలో ఛాన్స్ అందుకుందని టాక్ వస్తుంది. చైతన్య తండేల్ తర్వాత చేయబోతున్న సినిమాలో పూజా హెగ్దే (Pooja Hegde) హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఒక లైలా కోసం సినిమా..
విరూపాక్ష సినిమాతో సత్తా చాటిన డైరెక్టర్ కార్తీక్ దండు (Kartik Dandu) డైరెక్షన్ లో నాగ చైతన్య సినిమా వస్తుంది. ఈ సినిమాలో చైతు, పూజా హెగ్దే జత కట్టబోతున్నరని తెలుస్తుంది. నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమా చేసింది పూజా హెగ్దే కెరీర్ తొలి నాళ్లలో కలిసి నటించిన ఈ జంట మళ్లీ ఇన్నాళ్లకు జత కడుతున్నారు.
పూజా హెగ్దేకి ఈ ఛాన్స్ తో అయినా లక్ కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి. తెలుగులో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్న పూజా హెగ్దేకి ఈ ఆఫర్ లక్కీ అని చెప్పొచ్చు. ఓ పక్క కోలీవుడ్ లో సూర్య 44, దళపతి విజయ్ నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ అందుకుంది అమ్మడు.
Also Read : Varun Tej : మట్కా తర్వాత వరుణ్ తేజ్ సినిమా ఏంటో తెలుసా.. ఈసారి అలా ట్రై చేస్తున్నాడా..?