MAD Square: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…మ్యాడ్ స్క్వేర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ లో మార్పులు.. విడుదలయ్యేది అప్పడే?
మ్యాడ్ స్క్వేర్ సినిమా విడుదల తేదీని మారుస్తూ తాజాగా మూవీ మేకర్స్ ఒక ప్రకటనలో విడుదల చేశారు. సినిమా విడుదల తేదీని మార్చడం వెనుక ఉన్న కారణం గురించి కూడా తెలిపారు.
- By Anshu Published Date - 10:35 AM, Mon - 3 March 25

సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో ఫన్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ మ్యాడ్ స్క్వేర్. ఇప్పటికే గతంలో విడుదల అయిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మ్యాడ్ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కు సినిమా కూడా అంతకుమించి ఉండబోతోందని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మార్చి 29న విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే తాజా మూవీ మేకర్స్ అభిమానులకు ఒక శుభవార్త తెలిపారు. అదేమిటంటే.. మార్చి 29 శనివారం నాడు విడుదల కావాల్సి ఉన్న మ్యాడ్ స్క్వేర్ సినిమాను డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు ఒక రోజు ముందుగా అనగా మార్చి 28 శుక్రవారం నాడు విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారట. తాజా నిర్ణయంతో మ్యాడ్ స్క్వేర్ చిత్రం మొదటి వారాంతంలో భారీ వసూళ్ళను రాబడుతుందని అనడంలో సందేహం లేదు. మ్యాడ్ స్క్వేర్ సినిమాని ఒకరోజు ముందుగా విడుదల చేస్తుండటం పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందిస్తూ.. మా పంపిణీదారుల అభ్యర్థన, మద్దతుతో మ్యాడ్ స్క్వేర్ చిత్రం ఒక రోజు ముందుగా మార్చి 28వ తేదీన వస్తుంది. చివరి నిమిషంలో విడుదల తేదీ మార్చాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు.
మార్చి 29న అమావాస్య కావడంతో, మా పంపిణీదారులు విడుదలను ముందుకు తీసుకెళ్లడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం పట్ల మేము కూడా సంతోషంగా ఉన్నాము. మ్యాడ్ స్క్వేర్ సినిమాతో పాటు మార్చి 28న విడుదల కానున్న రాబిన్‌హుడ్ కూడా ఘన విజయం సాధించాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను. ఈ వేసవికి నవ్వుల పండుగ రాబోతుంది అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే విడుదల సమయం కంటే ఒకరోజు ముందుగా విడుదల చేస్తుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.