Mazaka: సెన్సార్ లో పవన్ డైలాగ్ కట్.. ఆ ఒక్క డైలాగ్ తో బాక్స్ ఆఫీస్ షేక్ అవడం ఖాయం.. కానీ!
సందీప్ కిషన్ హీరోగా నటించిన మజాకా సినిమాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక డైలాగ్ ను సెన్సార్ లో కట్ చేసినట్టు తెలుస్తోంది
- By Anshu Published Date - 11:30 AM, Sun - 23 February 25

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గత కొంతకాలంగా సరైన హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో బలమైన ముద్ర వేసుకోవడం కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత అలాంటి హిట్ ఈ మధ్యకాలంలో సందీప్ కి అస్సలు రాలేదు. ఇకపోతే సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ సినిమా మజాకా. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 26న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
సినిమా విడుదలకు మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. కాగా ఇందులో సందీప్ కిషన్ తండ్రి పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ఈ మూవీలో పిఠాపురం ఎమ్మెల్యే అనే డైలాగ్ ఉంది. కానీ సెన్సార్ వాళ్ళు దానిని కట్ చేశారు. ఈ మూవీలో నాకు ఇష్టమైన డైలాగ్ కూడా అదే అని సందీప్ కిషన్ తెలిపాడు. కానీ కాంట్రవర్సీ కాకూడదు అనే ఉద్దేశంతో సెన్సార్ సభ్యులు దానిని తొలగించారట.
ఇంతకీ ఆ డైలాగ్ ఏంటి అన్న విషయానికి వస్తే.. మూవీలో రావు రమేష్, అన్షు అంబానీ మధ్య వచ్చే సన్నివేశంలో ఆ డైలాగ్ ఉంటుంది. ఖుషి చిత్రంలోని పవన్ కళ్యాణ్, భూమిక సన్నివేశాన్ని మజాకా చిత్రంలో ఫన్నీగా రీ క్రియేట్ చేశారట. అన్షు అంబానీ నడుము చూసి రావు రమేష్ షేక్ అవుతుంటాడు. సందీప్ కిషన్ ఏమైంది నాన్నా అని అడుగుతాడు. పిఠాపురం ఎమ్మెల్యే గారు అప్పట్లో ఇలాంటివి చూసి ఎంత కంగారు పడి ఉంటారు ఇప్పుడు అర్థం అవుతోంది అని రావు రమేష్ అంటాడు. కానీ ఈ డైలాగ్ ని సెన్సార్ వాళ్ళు తొలగించారట. ఉండుంటే మాత్రం థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చేది అనే టాక్ వినిపిస్తోంది. ఈ ఒక్క డైలాగ్ తో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం అని కూడా తెలుస్తోంది. మరి మూవీలో ఈ డైలాగ్ ఉంటుందా లేదంటే మూవీ మేకర్స్ తీసేస్తారా అన్నది చూడాలి మరి.