Payal Rajput at 21 : 21లోనే మొదలు పెట్టా.. అప్పట్లోనే పిచ్చెక్కించే అందంతో పాయల్ రాజ్ పుత్..!
Payal Rajput at 21 ఆరెక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గ్లామర్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదటి సినిమాతోనే నెగిటివ్ రోల్ లో అందరిని సర్ ప్రైజ్
- Author : Ramesh
Date : 05-02-2024 - 2:10 IST
Published By : Hashtagu Telugu Desk
Payal Rajput at 21 ఆరెక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గ్లామర్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదటి సినిమాతోనే నెగిటివ్ రోల్ లో అందరిని సర్ ప్రైజ్ చేసింది. సినిమాతో పాయల్ రొమాంటి ఆడియన్స్ కు క్రేజీ ఫేవరెట్ అయ్యింది. అప్పటి నుంచి అమ్మడు చేస్తున్న సినిమాలకు సూపర్ బజ్ ఏర్పడింది. ఆరెక్స్ 100 తర్వాత దాదాపు అలాంటి పాత్రలే చేస్తూ వచ్చిన పాయల్ ఈమధ్యనే మంగళవారం అనే మరో మూవీతో సర్ ప్రైజ్ చేసింది.
We’re now on WhatsApp : Click to Join
ఆరెక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లోనే ఈ సినిమా తెరకెక్కింది. మంగళవారం సినిమాలో తన నటనతో ఆడియన్స్ ని మెప్పించిన పాయల్ సరైన పాత్ర పడితే తనలో ఎంత టాలెంట్ ఉందో ప్రూవ్ చేసుకుంది. ఇక ఇదిలాఉంటే ప్రస్తుతం బాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న మీ ఎట్ 21 లో భాగంగా పాయల్ రాజ్ పుత్ కూడా తన 21 ఏళ్ల వయసులో ఉన్న ఫోటో షేర్ చేసింది.
ఇప్పుడే కాదు 21 లో కూడా పిచ్చెక్కించే అందంతో పాయల్ మెప్పిస్తుంది. అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాయల్ ని చూసి అందరు గ్లామర్ హీరోయిన్ అనుకుంటారు కానీ ఆమెలో కూడా మంచి నటి ఉందని మంగళవారం చూసిన తర్వాత చాలామందికి అర్ధమైంది.
కచ్చితంగా మంగళవారం తర్వాత పాయల్ ని కేవలం రొమాంటిక్ యాంగిల్ లోనే కాకుండా ఆమెలోని నటిని గుర్తించే విధంగా పాత్రలు వస్తాయని చెప్పొచ్చు. పాయల్ కూడా అలాంటి అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేయాలని అనుకుంటుంది. ఇక 21 ఏళ్ల ఫోటో షేర్ చేస్తూ ఆ టైం లోనే మోడలింగ్ మొదలు పెట్టానని అప్పటి నుంచి తన ప్రయత్నం కొనసాగుతుందని రాసుకొచ్చింది.