Ustad Bhagat Singh : ఓటీటీలోకి పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’
గతేడాది ఓజీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్ ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించడంతో రిలీజ్ కు ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి
- Author : Sudheer
Date : 26-03-2026 - 10:15 IST
Published By : Hashtagu Telugu Desk
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే అటు థియేటర్లు అయినా ఓటీటీ అయినా రికార్డుల వేట జరుగుతూనే ఉంటుంది. గతేడాది ఓజీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్ ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించడంతో రిలీజ్ కు ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 2012 లో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఏ మేరకు సంచలనాలు క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే.
గబ్బర్ సింగ్ మూవీ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ కానున్న నేపథ్యంలో ఈ మూవీపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయం సాధించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. దాంతో పవన్ కెరీర్ లో ప్లాఫ్ గా ఈ చిత్రం నిలిచింది.
అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. థియేటర్ లో మిస్ అయిన ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. గతంలో పవన్ కల్యాణ్ ఓజీ మూవీ కూడా భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ నిర్మాత నవీన్ యెర్నేని గతంలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మూవీ ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలైన 5 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ తెలుగుతోపాటుగా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.