Allu Arjun: “హగ్స్ మాత్రమేనా..? పార్టీ లేదా పుష్పా” అంటూ బన్నీకి ఎన్టీఆర్ విషెస్.. సోషల్ మీడియాలో ట్వీట్స్ వైరల్..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) శనివారం 41 ఏడాదిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ , బాలీవుడ్ తో పాటు ప్రముఖులు బన్నీకి బర్త్ డే విషెష్ చెప్పారు.
- Author : Gopichand
Date : 09-04-2023 - 6:53 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) శనివారం 41 ఏడాదిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ , బాలీవుడ్ తో పాటు ప్రముఖులు బన్నీకి బర్త్ డే విషెష్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కూడా అల్లు అర్జున్ ను విష్ చేశారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా స్టైలిష్ స్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ (NTR) సోషల్ మీడియా వేదికగా నవ్వించాడు. “నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు బావ.. ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలి.” అంటూ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ పోస్ట్ పెట్టారు. ఇందుకు అల్లు అర్జున్ కూడా స్పందించారు. “విషెస్ చెప్పినందుకు నీకు థ్యాంక్యూ బావ.. నీకు నా హగ్స్” అంటూ స్టైలిష్ స్టార్.. తారక్ ట్వీట్‌కు స్పందించారు.
ఈసారి అల్లు అర్జున్ ట్వీట్‌కి తారక్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. “హగ్స్ మాత్రమేనా? పార్టీ లేదా పుష్పా” అని నవ్వుతూ ఎమోజీని జోడించారు. అల్లు అర్జున్ కూడా ‘వస్తున్నా’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా బాగా స్పందిస్తున్నారు. తారక్‌లో మంచి చమత్కారి దాగున్నాడని, ఆయనలో మంచి టైమింగ్ ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో ప్రతి ఒక్కరిని నవ్విస్తుంటారని స్పష్టం చేశారు.
Also Read: Ram Charan&Upasana: మాల్దీవ్స్ టూర్ లో రామ్ చరణ్, ఉపాసన, మెగా కపుల్ ఫొటో వైరల్
Thank you for your lovely wishes Bava … Warm Hugs .
— Allu Arjun (@alluarjun) April 8, 2023
Vasthunna !! 😉
— Allu Arjun (@alluarjun) April 8, 2023
ఇక బన్నీ పుష్ప సీక్వెల్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో, డిఫరెంట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ హడావిడి అయిపోవడంతో.. రీసెంట్ గా NTR30 షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. వచ్చే ఏడాది NTR30 ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.