Ram Charan&Upasana: మాల్దీవ్స్ టూర్ లో రామ్ చరణ్, ఉపాసన, మెగా కపుల్ ఫొటో వైరల్
మల్దీవ్స్ కు బయలుదేరుతున్న చరణ్, ఉపాసన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.
- By Balu J Published Date - 05:11 PM, Sat - 8 April 23

టాలీవుడ్ మోస్ట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన (Charan & Upasana) త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇప్పటికే దుబాయ్ లో బేబీ షవర్ వేడులకు సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట మరో విహారయాత్రకు సిద్దమయ్యారు. శనివారం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. చరణ్, ఉపాసన సౌకర్యవంతమైన దుస్తుల్లో మల్దీవ్స్ కు బయలుదేరారు (Charan & Upasana).
చరణ్, నేవీ బ్లూ పోలో టీ-షర్ట్, బ్లాక్ ప్యాంట్‌లో, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని కనిపించగా, ఉపాసన తెల్లటి స్కర్ట్ వేసుకుంది. అయితే పెట్ కుక్కతో కనిపించే ఈ జంట ఈసారి మాత్రం వెంట తీసుకుపోలేదు. ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్నాయి. ఇటీవల దుబాయ్‌లో తమ సన్నిహితులతో బేబీ షవర్ ఫంక్షన్‌ను జరుపుకున్నారు. దుబాయ్‌లో ఉపాసన తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది. ఆ వేడుకకు కోసం చరణ్, ఉపాసన 1.5 కోట్ల ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందమైన జంటలలో చరణ్, ఉపాసన (Charan & Upasana) ఒకటి. ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతుంటంతో మెగా ఇంట ఆనందం నెలకొంది. పెళ్లయిన 10 సంవత్సరాల తర్వాత ఉపాసన గర్భం దాల్చడం మెగా ఫ్యామిలీ ఆనందం నింపుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించబోతున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా, ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. కైరా అద్వానీ ఈ చిత్రంలో కథానాయిక. ఇందులో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: Movies at Home: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇంట్లోనే కొత్త సినిమాలు చూడొచ్చు!