Manchu Family: మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న గొడవలు!
మంచు ఫ్యామిలీ పై యూట్యూబ్‌లో ప్రొడ్యూసర్ చిట్టిబాబు తప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అంటూ మంచు ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం జల్‌పల్లి నివాసంలో ఎవరు లేరు అని పోలీసులు అంటున్నారు.
- By Gopichand Published Date - 10:37 AM, Tue - 17 December 24

Manchu Family: తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులు హాట్ టాపిక్‌గా నిలిచిన మంచు ఫ్యామిలీ (Manchu Family) వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పోలీసులు మంచు మనోజ్, విష్ణులకు సైతం వార్నింగ్ ఇచ్చారు. అయితే శనివారం రాత్రి మంచు విష్ణు తన అనుచరులతో వచ్చి జనరేటర్‌లో షుగర్ పోశాడు అంటూ మనోజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులకు మనోజ్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఓవరాల్‌గా ఈ ఘటన గురించి పోలీసులకు మనోజ్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మంచు ఫ్యామిలీ పై యూట్యూబ్‌లో ప్రొడ్యూసర్ చిట్టిబాబు తప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అంటూ మంచు ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం జల్‌పల్లి నివాసంలో ఎవరు లేరు అని పోలీసులు అంటున్నారు. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ప్రతి రెండు గంటలకు ఒకసారి మోహన్ బాబు నివాసంలో పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలిపారు. బయట వ్యక్తులు, బౌన్సర్లు ఎవరు అక్కడ ఉండొద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈనెల 24 వరకు మోహన్ బాబుకు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. ఈనెల 24 తర్వాత మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేస్తామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఇటీవల వివరించారు. అప్పుడు విచారణకు రాకుంటే మోహన్ బాబును అరెస్ట్ చేస్తాం రాచకొండ సీపీ తెలిపారు.
జనసేనలోకి మంచు మనోజ్?
ఇకపోతే మంచు ఫ్యామిలీ వివాదం కారణంగా మనోజ్- మౌనిక దంపతులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ రాజకీయంగా అరంగేట్రం చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మనోజ్ దంపతులు త్వరలోనే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. అయితే జనసేనలో చేరికపై తాజాగా స్పందించిన మనోజ్ ఈ విషయంపై ఇప్పుడేమీ చెప్పలేనని మీడియాకు వివరించారు. మరోవైపు మంచు మోహన్ బాబు అరెస్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.