Naveen Polishetty: హీరో నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. రెండు నెలలు సినిమాలకు దూరం..?
'జాతి రత్నాలు' స్టార్ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)కి అమెరికాలో ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం.. ఇది చిన్న ప్రమాదమే అని తెలుస్తోంది.
- By Gopichand Published Date - 11:32 AM, Thu - 28 March 24

Naveen Polishetty: ‘జాతి రత్నాలు’ స్టార్ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)కి అమెరికాలో ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం.. ఇది చిన్న ప్రమాదమే అని తెలుస్తోంది. కానీ నవీన్ కోలుకోవడానికి సమయం పడుతుందని సమాచారం. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా అమెరికాలో ఉన్న నటుడు నవీన్ పోలిశెట్టికి ప్రమాదం జరిగినట్లు సమాచారం. బైక్ మీద నుంచి జారి పడడంతో నవీన్ చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో నవీన్‌కు యాక్సిడెంట్ జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
#News హీరో నవీన్ పోలిశెట్టి అమెరికాలో బైక్ మీద నుంచి
జారిపడడంతో చేతికి ఫ్యాక్చర్ అయిందట.
రెండు నెలలు విశ్రాంతి అవసరం అని తెలుస్తోంది— devipriya (@sairaaj44) March 28, 2024
Also Read: MGNREGA: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. వేతన రేటు పెంపు..!
అయితే ఈ ప్రమాదం కొద్ది రోజుల క్రితం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు కొన్ని కథనాలు వస్తున్నాయి. ప్రమాదం గురించి నవీన్ తన బృందానికి తెలియజేశాడని, అతను చేతికి తీవ్ర గాయమైందని ప్రముఖ ఏజెన్సీ తన కథనంలో పేర్కొంది. గాయం నయం కావడానికి చాలా వారాలు పడుతుందట. నవీన్ పూర్తిగా కోలుకునే వరకు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. నవీన్ చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీలో అనుష్కకు జోడిగా కనిపించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టి నవీన్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. అయితే నవీన్ పోలిశెట్టి ప్రమాదం గురించి ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. జాతి రత్నాలు, మిస్టర్ శెట్టి మిస్ పోలిశెట్టి తర్వాత ఒక మంచి కంబ్యాక్ ఇచ్చేందుకు నవీన్ రెడీ అవుతున్నాడు,
We’re now on WhatsApp : Click to Join