Nara Rohit: నారా రోహిత్ కొత్త మూవీకి డైరెక్టర్ గా టీవీ5 మూర్తి..!
యంగ్ హీరో నారా రోహిత్ (Nara Rohit) తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ప్రతినిథి సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు. ఈ మేరకు దానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశాడు.
- Author : Gopichand
Date : 23-07-2023 - 12:04 IST
Published By : Hashtagu Telugu Desk
Nara Rohit: యంగ్ హీరో నారా రోహిత్ (Nara Rohit) తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ప్రతినిథి సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు. ఈ మేరకు దానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశాడు. మూర్తి అనే సీనియర్ జర్నలిస్ట్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు. ఏపీ ఎన్నికలలోపు ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.
నారా రోహిత్ ‘బాణం’ సినిమాతో హీరోగా ప్రయాణం మొదలుపెట్టాడు.. మొదటి సినిమాతోనే తన ప్రతిభను నిరూపించుకున్నారు. సోలో లాంటి కమర్షియల్ సినిమా చేసి హీరోగా తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆ తరవాత ఆయన చేసిన ఏ సినిమా కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. కానీ, నటుడిగా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి’ నారా రోహిత్‌ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది.
ఏడాదిలో రెండు నుంచి నాలుగు సినిమాల్లో నటించిన నారా రోహిత్ ఇటీవల బాగా వెనకబడిపోయారు. ఆయన చివరిగా 2018లో వీరభోగ వసంత రాయలు సినిమాలో కనిపించారు. ఆ తరవాత ఆయన కొన్ని సినిమాలకు సైన్ చేసినా కోవిడ్, లాక్‌డౌన్ల కారణంగా అవన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ఐదేళ్ల తరవాత ఇప్పుడు మళ్లీ వెండితెరపై కనిపించడానికి నారా రోహిత్ సిద్ధమవుతున్నారు. మరోసారి పొలిటికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Also Read: Multani Mitti: చర్మానికి వరం లాంటిది ముల్తానీ మిట్టి.. ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండిలా..!
తన 19వ సినిమా గురించి నారా రోహిత్ ప్రకటన చేశారు. ఈనెల 24వ తేదీన సాయంత్రం 4.03 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో 2 అనే నంబర్ రాసి ఉంది. అలాగే, చేయి పైకెత్తి రెండు వేళ్లు ముడి, మూడు వేళ్లు పైకి చూపిస్తున్నట్టు డిజైన్ చేశారు. ఈ చేతికి వార్తాపత్రికలలా కనిపిస్తున్న పేపర్లను చుట్టి ఉంచారు. ‘అన్ని అసమానతలకు వ్యతిరేకంగా ఒక మనిషి మరోసారి నిలబడబోతున్నాడు’ అని ఇంగ్లిష్‌లో రాశారు.
అయితే ఇది ‘ప్రతినిధి’కి ఇది సీక్వెల్ అని అంటున్నారు. ‘ప్రతినిధి 2’ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా ద్వారా ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకైన రోహిత్‌తో మూర్తి సినిమా చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. కాగా, టీవీ5 మూర్తి ఇప్పటికే పలు సినిమాల్లో నటించారు. ఇప్పుడు దర్శకుడిగా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నారు.