HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nandamuri Kalyan Ram Is Getting Ready With Back To Back Movies

బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రెడీ అవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్

  • Author : Vamsi Chowdary Korata Date : 05-01-2026 - 3:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bimbisara 2
Bimbisara 2

Bimbisara 2 నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమాలపై దృష్టి పెట్టారు. బింబిసార సక్సెస్ తర్వాత ఆయన నటించిన సినిమాలేవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే ఈసారి పక్కా హిట్టు కొట్టే సినిమాతో రావాలని చూస్తున్నారు. ఇప్పటికే ‘బింబిసార 2’ సినిమాని అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్.. మరో రెండు మూడు కొత్త కథలపై చర్చలు జరుపుతున్నారని టాక్ నడుస్తోంది. వీటిలో రెండు హోమ్ ప్రొడక్షన్ లో, ఒకటి బయటి బ్యానర్ లో ఉంటాయని చెబుతున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి హిట్టు పడలేదు. గతేడాది వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ నిరాశ పరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. కొత్త సబ్జెక్ట్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఏదోకటి చేసేద్దాం అనుకోకుండా, కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ ఒక ప్రాజెక్టును అనౌన్స్ చేసిన నందమూరి హీరో.. మరో రెండు కథలకు పాజిటివ్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.

బింబిసారకు కొనసాగింపుగా బింబిసార 2 సినిమా తెరకెక్కనున్నట్లు కళ్యాణ్ రామ్ ఇది వరకే ప్రకటించారు. లాస్ట్ ఇయర్ ఆయన బర్త్ డే సందర్భంగా #NKR22 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్ తీసిన డైరెక్టర్ వశిష్ఠ ఈ సీక్వెల్ ను తెరకెక్కించడం లేదు. మరో దర్శకుడు అనిల్ పాడూరికి ‘బింబిసార 2’ బాధ్యతలు అప్పగించారు. అయితే ప్రకటన వచ్చి ఆరు నెలలు గడిచింది కానీ.. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ దాకా వచ్చింది? షూటింగ్ స్టార్ట్ అయిందా లేదా? వంటి వివరాలేమీ బయటకు రాలేదు.

ఇదిలా ఉంటే రచయిత శ్రీకాంత్ విస్సాతో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారనే టాక్ నడుస్తోంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు, మాటలు అందించిన శ్రీకాంత్.. మెగా ఫోన్ పట్టి దర్శకత్వం చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ కి ఓ కథ నేరేట్ చేశారట. ప్రస్తుతం కథపై డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఇది కాకుండా మరో కొత్త దర్శకుడు కూడా ఓ కథ చెప్పారట. దాని మీదా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయట.

ఇలా కళ్యాణ్ రామ్ బింబిసార 2 తో పాటుగా మరో రెండు స్టోరీలను లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. వీటిల్లో రెండు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ లో హోమ్ ప్రొడక్షన్ లో రూపొందనున్నాయి. ఒకటి మాత్రం బయటి బ్యానర్ లో చేస్తారని అంటున్నారు. అయితే వీటిల్లో ఏది ముందుగా పట్టాలెక్కుతుందనేది చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bimbisara 2
  • bimbisara film
  • cinema updates
  • KalyanRam
  • Nandamuri Kalyanram
  • tollywood
  • Tollywood Cinema Updates

Related News

Venkatesh reunites with Anil Ravipudi

వెంకీ-కళ్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడి మల్టీస్టారర్

Anil Ravipudi విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ వంటి హిట్ చిత్రాల తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రలో కనిపించనున్

    Latest News

    • ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

    • టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్

    • Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

    • నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

    • శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    Trending News

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd