Nakkina Trinatha Rao : ధమాకా డైరెక్టర్ నిర్మాతలకు కొత్త దంకీ.. ఈ ట్విస్ట్ ఎవరు ఊహించలేదుగా..!
Nakkina Trinatha Rao మాస్ మహరాజ్ రవితెజతో ధమాకా అంటూ సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు ఆ సినిమా తర్వాత తన డైరెక్షన్ లో మరో సినిమా మొదలు
- By Ramesh Published Date - 10:34 PM, Sun - 4 February 24

Nakkina Trinatha Rao మాస్ మహరాజ్ రవితెజతో ధమాకా అంటూ సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు ఆ సినిమా తర్వాత తన డైరెక్షన్ లో మరో సినిమా మొదలు పెట్టలేదు. ధమాకా తర్వాత ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా కాదన్నాడట. మరోపక్క తేజా సజ్జ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని టాక్ రాగా లేటెస్ట్ గా తన సొంత బ్యానర్ ని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు నక్కిన త్రినాథ రావు.
డైరెక్టర్లు సొంత నిర్మాణ సంస్థలను మొదలు పెట్టడం. దర్శక నిర్మాతలుగా పనిచేయడం అన్నది కొత్తేమి కాదు. కానీ ఈమధ్య కాలంలో అలా ఎవరు చేయలేదు. నక్కిన త్రినాథ రావు తన సొంత బ్యానర్ ని నక్కిన నరేటివ్స్ అంటూ బ్యానర్ మొదలు పెట్టాడు. ఈ బ్యానర్ లో తన సినిమాలు చేసే ఛాన్స్ ఉంది.
అయితే ఈ బ్యానర్ మొదటి వెంచర్ ఏంటి.. ఈ బ్యానర్లో ఎలాంటి సినిమాలు చేస్తారన్నది మాత్రం ఇంకా తెలియలేదు. నక్కిన త్రినాథ రావు ఈ బ్యానర్లో కొత్త వారికి అవకాశం ఇస్తాడా లేదా అన్నది చూడాలి. నక్కిన న్యారేటివ్స్ తో ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి.
Also Read : Ajay Ghosh : మొన్న విలన్ నిన్న కమెడియన్ ఇప్పుడు హీరో.. ఈ దూకుడు ఏంటో.. మ్యాజిక్ షాప్ మూర్తితో అజయ్ ఘోష్..!