MS Dhoni : బాలీవుడ్ స్టార్ తో కలిసి ధోని.. మూవీ షూటింగ్ లో ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ చూస్తూ..
ఈ మ్యాచ్ ని మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ మూవీ షూటింగ్ లో చూశారు.
- By News Desk Published Date - 08:32 AM, Mon - 24 February 25

MS Dhoni : నిన్న రాత్రి ఇండియా వర్సెస్ పాకిస్థాన్(IND Vs PAK) మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరగ్గా ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ ని మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ మూవీ షూటింగ్ లో చూశారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా జాట్ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే నిన్న ఈ సినిమా షూటింగ్ కి ధోని వచ్చి సందడి చేసాడు. దీంతో నిన్న సాయంత్రం ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ ని ధోని హీరో సన్నీ డియోల్ తో కలిసి మూవీ షూటింగ్ లో చూసాడు.
ఈ విషయాన్నీ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ధోని – బాలీవుడ్ హీరోని కలిసి చూడటంతో బాలీవుడ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే జాట్ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాని ఏప్రిల్ 10న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు.
జాట్ సినిమా రవితేజ చెయ్యాల్సింది కానీ బడ్జెట్ పెరగడంతో రవితేజ మీద అంత మార్కెట్ లేదని నిర్మాతలు బాలీవుడ్ కి వెళ్లి చేస్తున్నారు. మరి జాట్ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
Also Read : Chiranjeevi : ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో మెగాస్టార్ సందడి.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మలతో కలిసి..